బరువు తగ్గడం అంత సులువు కాదు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే.. మీరు బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చూస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. గ్లూకోజ్ తక్కువగా పెరిగితే శరీరంలో ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఇన్సులిన్ వల్ల శరీరం ఎక్కువ కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు.