ఉదయాన్నే రన్నింగ్ చేసే అలవాటుందా? అయితే ఈ జాగ్రత్తలను పాటించకపోతే కష్టం..

Published : Jun 09, 2022, 04:32 PM IST

శరీరం ఎలాంటి రోగాల బారిన పడకూడదన్నా.. ఫిట్ గా ఉండాలన్నా రన్నింగ్ ఖచ్చితంగా చేయాలి. అదికూడా డైలీ. అయితే రన్నింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్ర్తలను తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..  

PREV
16
ఉదయాన్నే రన్నింగ్ చేసే అలవాటుందా? అయితే ఈ జాగ్రత్తలను పాటించకపోతే కష్టం..


ఫిట్ గా ఉండటానికి  ప్రజలు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అందులో కొందరు జిమ్ కు వెళితే.. మరికొంత మంది ఉదయం కొంతదూరం పాటు నడుస్తారు.  ఇంకొంతమంది రన్నింగ్ చేస్తారు.  రన్నింగ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పరిగెత్తడం ద్వారా మీరు ఎంతో ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యం ఒక రోజులో మీరు ఎంత దూరం పరిగెత్తుతారు అనేది మీపై ఆధారపడి ఉంటుంది. పరిగెత్తడం యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా.. మీ రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ పరిగెత్తేటప్పుడు మీరు కొన్ని విషయాలను గుర్తించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఏరికోరి సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లవుతారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

26

పరిగెత్తడానికి ముందు ఏదైనా తినండి: చాలా మంది లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి రన్నింగ్ కు వెళతారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అందుకే పరిగెత్తడానికి 30 నిమిషాల ముందు తేలికపాటి ఆహారాన్ని తినండి. ఇది మీరు పరిగెత్తడానికి శక్తిని ఇస్తుంది. ఖాళీ కడుపుతో ఎప్పుడూ పరిగెత్తకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

36

ఒంటరిగా పరిగెత్తవద్దు : మీరు ఒంటరిగా పరిగెత్తడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. అందుకే ఉదయం మీతో పాటు రన్నింగ్ కు మీ స్నేహితులను కూడా తీసుకెళ్లండి. దీనివల్ల మీ మనోధైర్యం పెరుగుతుంది. మీరు సాంగ్స్ వింటూ కూడా రన్నింగ్ చేయొచ్చు. కానీ మీరు పరిగెత్తుతున్నప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసే పాటలను మాత్రమే వినండి.

46
corn

బిగ్గరగా ఉండే బట్టలను వేసుకోకూడదు: పరిగెత్తేటప్పుడు ఎప్పుడూ బిగుతైన బట్టలు ధరించకూడదు. మీరు రన్నింగ్ కు వెళుతున్నప్పుడు.. మీకు సౌకర్యవంతంగా (Convenient)అనిపించే దుస్తులను మాత్రమే వేసుకోండి. బిగుతుగా (Tight) ఉండే దుస్తులు రన్నింగ్ లో సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి రన్నింగ్ కు వెళ్లే వాళ్లు వదులుగా ఉండే దుస్తులను మాత్రమే వేసుకోవాలి. 

56

ముందు నడవండి, తరువాత పరిగెత్తండి: డైరెక్ట్ గా మీరు లేచిన వెంటనే పరిగెత్తితో నొప్పి పుట్టొచ్చు. అందుకే పరుగెత్తే ముందు కాసేపు నడవండి. ఆ తర్వాత పరిగెత్తండి. రన్నింగ్ ప్రారంభించడానికి 5 నుంచి 10 నిమిషాల ముందు సాధారణ నడక నడవండి. ఆ తర్వాత రన్నింగ్ ను ప్రారంభించండి. దీన్ని రోజూ ఫాలో అవ్వండి. ఎందుకంటే పరిగెత్తే ముందు శరీరానికి వార్మప్ అవసరం.

66

మీరు ప్రతిరోజూ పరిగెత్తితే.. అప్పుడు మీరు రన్నింగ్ షూలను ఉపయోగించడం అవసరం. రన్నింగ్ షూస్ ను ధరించి రన్నింగ్ చేయడం వల్ల మీ పాదాలు దెబ్బతినకుండా ఉంటాయి. అందులో రన్నింగ్ షూలు చాలా తేలికగా ఉంటాయి. దీని వల్ల మీ పాదాలకు ఎక్కువ లోడ్ కూడా ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories