పచ్చి బఠానీలు బరువు తగ్గించడానికే కాదు.. బరువును నియంత్రించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు,క్యాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతో సహాయపడతాయి. అంతేకాదు గుండెను కూడా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి.