Salmon Fish: ఈ చేప వారానికి ఒకసారి తిన్నా ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

Published : Jun 22, 2026, 04:55 PM IST

Salmon Fish: చేపలు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ అన్ని చేపల్లో కల్లా ఈ అరుదైన చేప తింటే.. చాలా లాభాలున్నాయి. కీళ్ల నొప్పులు తగ్గాలంటే ఈ చేప తింటే చాలు. బరువు తగ్గడానికి, ముఖంలో గ్లో రావడానికి, జుట్టు రాలడం తగ్గడానికి చాలా మంచిది.

PREV
14
చికెన్, మటన్ కంటే…చేపలే బెటర్

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. చికెన్, మటన్ కంటే…చేపలే బెటర్. త్వరగా జీర్ణమవుతాయి. ఎంత తిన్నా బరువు కూడా పెరగరు. అందులో ఈ సాల్మన్ చేపలో శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. బీపీ, కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్‌ను తగ్గించడంలో, డిప్రెషన్‌ను నివారించడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా ఇవి సాయపడతాయి. 

24
ప్రోటీన్

సాల్మన్ చేపలో అమినో యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు, వాటిని బలంగా మార్చడానికి సాయపడతాయి. మెటబాలిజం కొనసాగించడానికి, బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి కూడా సాల్మన్ తినడం మంచిది. 

34
విటమిన్లు
ఆరోగ్యకరమైన జీవనశైలికి విటమిన్లు చాలా అవసరం. సాల్మన్ చేపలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు, నాడీ వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తాయి.
44
మినరల్స్

సాల్మన్ చేపలో ఫాస్పరస్, పొటాషియం, సెలీనియం వంటి మినరల్స్ ఉంటాయి. ఈ చేపను తినడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories