మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఇలా చేయండి..

Published : Oct 09, 2022, 02:37 PM IST

చుండ్రు, తెల్లజుట్టు, నెత్తిమీద దురద వంటి సమస్యలను వీలైనంత తొందరగా వదిలించుకోవాలి. లేదంటే జుట్టు మొత్తం ఊడిపోతుంది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పక పాటించాల్సిందేనంటున్నారు నిపుణులు.   

PREV
16
మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఇలా చేయండి..
hair care

ఆరోగ్యకరమైన, బలమైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందులో నల్లని, ఒత్తైన జుట్టును కోరుకోని వారుండదు. ఇక ఇందుకోసం ఎన్నో రకాల షాంపూలను, హెయిర్ ఆయిల్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇందుకోసం కొంతమంది ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పార్లర్ కు వెళుతుంటాయి. నెత్తిలో చుండ్రు,  తెల్లజుట్టు, డ్రై హెయిర్, నెత్తిమీద దురద వంటి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలి. వీటివల్ల ఉన్న జుట్టు కూడా ఊడిపోతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మీ జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. 

26

తడి జుట్టును దువ్వే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇలా అస్సలు దువ్వకూడదు. ఎందుకంటే జుట్టు తడిగా ఉన్నప్పుడు జుట్టు మొదళ్లు బలహీనంగా ఉంటాయి. ఇలాంటి మయంలో నెత్తిని దువ్వితే జుట్టు చాలా ఊడిపోతుంది. అంతేకాదు ఆ వెంట్రుకలను దువ్వితే వెంట్రుకలు చిట్లిపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇకపై తడి జుట్టును దువ్వే పనిమాత్రం పెట్టుకోకండి. 

36

చాలా మందికి జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటాయి. దీనివల్ల జుట్టు ఏం చేసినా పెరగను గాక పెరగదు. ఇలా కాకుండదంటే మీ జుట్టును ప్రతి 6 నుంచి 8 వారాలకోసారి కొనలు కత్తిరించండి. కనీసం ఒకటిన్నర అంగుళాల జుట్టునైనా కత్తిరించండి. ఇది మీ వెంట్రుకలు పగిలిపోయే సమస్యను తొలగిస్తుంది. జుట్టు కూడా అందంగా పెరుగుతుంది. 
 

46

జుట్టు కు రెగ్యులర్ గా షాంపూ పెట్టేవారు కూడా ఉన్నారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే జుట్టుకు ప్రతిరోజూ షాంపూ పెట్టడం వల్ల జుట్టు పొడిబారుతుంది. అలాగే వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. అందుకే రెగ్యులర్ గా షాంపూను జుట్టుకు అప్లై చేయకండి. షాంపూను వారానికి 2 రోజులు మాత్రమే పెట్టండి. అందులో తక్కువ ఘాడత ఉన్న షాంపూలనే పెట్టాలి. లేదంటే మీ హెయిర్ రాలడం తో పాటుగా రఫ్ గా కూడా మారుతుంది. 

56

మీ జుట్టు ఆరోగ్యంగా, పొడుగ్గా, మందంగా పెరగాలంటే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. లోపలి నుంచి పోషణ అందినప్పుడే జుట్టు బలంగా పెరుగుతుంది. అందుకే మీరు తినే  ఆహారంలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉండేట్టు చూసుకోండి. ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు తినడం వల్ల మీ శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. దీంతో మీ జుట్టుకు పోషణ అందుతుంది. జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. 

66

జుట్టుతో రకరకాల ప్రయోగాలు చేసేవారున్నారు. కలర్, తీరుతీరు స్టైల్లో జుట్టు వేసుకోవడం, స్ట్రెయిటనింగ్, కర్లింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ వీటివల్ల జుట్టు దెబ్బతింటుంది. పొడిగా కూడా మారుతుంది. అందుకే జుట్టుతో ఎలాంటి ప్రయోగాలు చేయకండి. మీ జుట్టుకు రసాయనాల ప్రొడక్ట్స్ ను అసలే ఉపయోగించకండి. లేదంటే జుట్టు సమస్యలు పెరుగుతాయి. 
 

click me!

Recommended Stories