జూనియర్ ఎన్టీఆర్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

Published : Mar 23, 2022, 01:26 PM IST

అంత ఫిట్ గా మారేందుకు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు..? ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

PREV
19
జూనియర్ ఎన్టీఆర్ డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు  జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏలుతున్న టాప్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.

29

నిన్ను  చూడాలని సినిమాతో ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కాగా.. అప్పటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ.. తన దైన శైలితో ఆకట్టుకుంటూ లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు

39

ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాన్ ఇండియా సినిమా కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

49

రాజమౌళి దర్శకత్వంలో తెరపైకి వస్తున్న  ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 9 కేజీల మజిల్ పెంచడం విశేషం. ఈ సినిమాలో ఆయన కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్నారు. కాగా..   ఆయన  అంత ఫిట్ గా మారేందుకు ఎలాంటి డైట్ ఫాలో అయ్యారు..? ఆయన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

59

ఆయన తన బాడీ మెయింటైన్ చేసుకోవడం కోసం డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఆయన ప్రతి మూడు గంటలకు ఒకసారి ఆహారం తీసుకుంటారట.

69

డైట్ లో భాగంగా ఆయన ఎగ్ వైట్స్, ఉడకపెట్టిన చికెన్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారట. తన డైట్ లో కచ్చితంగా ప్రోటీన్స్, కార్బ్స్ ఎక్కువగా ఉండేలా  చూసుకోవాలట.

79

అంతేకాకుండా.. తాను తీసుకునే ఆహారంలో.. ఫ్యాట్ తక్కువగా ఉండేలా చూసుకుంటాడట. ఈ విషయాన్ని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ స్వయంగా చెప్పడం విశేషం.

89


తన ఎనర్జీ లెవల్స్ పెంచుకోవడానికి.. ఆయన బాదం పప్పు, వాల్ నట్స్ ని భోజనానికి ముందు తీసుకుంటారట. అంతేకాకుండా తన రోజువారి డైట్ లో.. పండ్లు కూడా తీసుకుంటారట.
 

 

99

ఇక ప్రతిరోజూ జిమ్ లో కష్టపడతారట. కార్డియో కోసం ప్రతిరోజూ గంటన్నర కేటాయిస్తారట. మరో గంటన్నర ఇతర వ్యాయమాలు చేస్తారట. ఆయన జిమ్ లో కష్టపడుతున్న వీడియోను ఆయన ట్రైనర్ వీడియో  కూడా షేర్ చేయడం గమనార్హం.

click me!

Recommended Stories