ఏలకుల నీటిని రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

First Published Dec 26, 2022, 2:01 PM IST

యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వీటిని నానబెట్టిన నీటిని రోజూ తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 
 

మసాలా దినుసులు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ పదార్ధాలతో కలిపిన నీరు లేదా టీ లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. దాల్చినచెక్క టీ, అల్లం టీ, ఏలకుల టీ, జీలకర్ర నీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

యాలకుల విత్తనాలు, వాటి సారం, నూనెలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. అందుకే వీటిని పురాతన కాలం నుంచి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. వీటిని వివిధ వంటల్లో కూడా ఉపయోగిస్తుంటారు. యాలకుల్లో  జీర్ణ  ప్రక్రిరయలను పెంచే శక్తివంతమైన యాంటీ బయోటిక్, యాంటీ ఆక్సిడెంట్  లక్షనాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అసలు యాలకుల నీటిని రోజూ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఏలకుల్లో విటమిన్లు,  ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు కొలెస్ట్రాల్ మొత్తమే  ఉండదు. ఏలకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, సోడియం, రాగి, మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్, భాస్వరం, జింక్ తో సహా ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

జీవక్రియను పెంచుతుంది

యాలకుల నీరు మన జీవక్రియను బాగా పెంచుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వేగంగా కరిగిపోతుంది.  ఇది జీవక్రియ వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుంది. 
 

పొత్తి కడుపు కొవ్వును తగ్గిస్తుంది 

పొత్తికడుపు కొవ్వును కరిగించడం చాలా కష్టం. ముఖ్యంగా డెలివరీ తర్వాత. అందులోనూ పొత్తికడుపు కొవ్వు  ఎక్కువగా ఉండటం వల్ల చాలా మందికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే  ఏలకుల నీరు పొట్టకు కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది.  ప్రతిరోజూ 2 నుంచి 3 ఏలకుల విత్తనాలను తీసుకోవడం వల్ల మీ జీవక్రియ మెరుగుపడుతుంది. అలాగే మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్. 

అజీర్ణాన్ని తగ్గిస్తుంది

అజీర్థి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పిని తగ్గించడానికి యాలకుల నీరు బాగా పనిచేస్తుంది. యాలకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు బ్యాక్టీరియాతో పోరాడటానికి, తక్కువ సమయంలో గట్  ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. కడుపు నొప్పి ఉన్న పిల్లలకు యాలకుల టీలు బాగా సహాయపడుతుంది. ఎందుకంటే గట్ సమస్యలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.


మెలటోనిన్ కలిగి ఉంటుంది

మెలటోనిన్ జీవక్రియను పెంచుతుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెలటోనిన్ కొవ్వు తగ్గడానికి రెండు విధాలుగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.  మొదటిది ఇది కొవ్వును నిల్వ చేయడానికి బదులుగా శక్తిగా మారుస్తుంది. ఇక రెండోది ఇది మైటోకాండ్రియా థర్మోజెనిక్ చర్యను పెంచుతుంది. మైటోకాండ్రియా క్యాలరీ బర్నింగ్ ప్రక్రియను సహాయపడుతుంది. 

యాలకుల్లో మెలటోనిన్ తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ.. ఇది భారీ బరువును తగ్గించడంలో సహాయపడలేనప్పటికీ.. రోజూ క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బరువును తగ్గుతారు. 

80 మంది ఊబకాయం ప్రీడియాబెటిక్, అధిక బరువు ఉన్న మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఏలకులు తీసుకోవడం వల్ల నడుము పరిమాణం బాగా తగ్గిందని కనుగొన్నారు.
 

cardamom

జీర్ణక్రియను పెంచుతుంది

చాలా మంది భోజనం చేసిన  తర్వాత ప్రతి సారి  1 నుంచి 2 ఏలకులను తప్పకుండా తింటారు. ఎందుకంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలకు చికిత్స చేయడమే కాకుండా కడుపు పూతలని కూడా నయం చేస్తుంది. 
 

.

cardamom

గర్భధారణ తరువాత బరువు తగ్గడానికి, అజీర్ణం సమస్యలు, అనారోగ్యకరమైన గట్, అపానవాయువు, వృద్ధాప్యంలో ఊబకాయం, పొత్తికడుపు కొవ్వును కరిగించడానికి ఏలకుల నీరు బాగా సహాయపడుతుంది. 
ఉదయం నిద్రలేచిన వెంటనే మసాలా కలిపిన నీటిని తాగడం వల్ల శరీరం నుంచి విషం బయటకు పోతుంది. 
 

click me!