ఇందుకోసమే తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పే బెస్ట్ అంటరు..

First Published Sep 25, 2022, 11:59 AM IST

నల్ల ఉప్పులో ఉండే ఔషదగుణాలు బరువును తగ్గించడమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

నల్ల ఉప్పును హిమాలయన్ బ్లాక్ సాల్ట్ (Himalayan Black Salt), సులేమాణి నమక్, కాలా నమక్ ఇలా వివిధ రకాలుగా పిలుస్తారు. ఈ నల్ల ఉప్పు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉండి ఆహారపదార్థాలకు మంచి రుచి, వాసనను అందిస్తుంది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ ఉప్పులో సోడియం శాతం (Percentage of sodium) తక్కువగా ఉంటుంది.
 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మన శరీరానికి ప్రతిరోజూ 5 గ్రాముల సోడియం లేదా ఉప్పు అవసరం. సాధారణంగా మనం వంటల్లో తెల్ల ఉప్పును మాత్రమే ఉపయోగిస్తాం.. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల తలనొప్పి, మూత్రపిండాల్లో రాళ్లు, గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు, ఉబ్బరం వంటి రోగాల ప్రమాదం పెరుగుతుంది.  ఈ సమస్యలలో ఏది మీకు ఉన్నట్టు అనిపించినా.. వెంటనే తెల్ల ఉప్పు వాడకం తగ్గించండి. 

ఆహారంలో ఉప్పు ఎందుకు అవసరం?

సోడియం క్లోరైడ్ అని పిలువబడే ఉప్పులో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. ఇది ఫుడ్ ను టేస్టీగా చేస్తుంది. అంతేకాదు ఉప్పు కూరల్లో బ్యాక్టిరియాలను కూడా చంపుతుంది. అందుకే ఉప్పును ఆహార సంరక్షణకారిణి అని కూడా అంటారు. నాడీ ప్రేరణలను నిర్వహించడానికి, కండరాలను సంకోచించడానికి, సడలించడానికి, నీరు, ఖనిజాలు సరైన నిష్పత్తిలో ఉండటానికి మన శరీరానికి ఉప్పు అవసరం అవుతుంది. అయితే తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పే మన ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. దానికి కారణాలేంటో తెలుసుకుందాం పదండి. 

 పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే సోడియం స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి.

కడుపు సమస్యలను తగ్గిస్తుంది:  కాలేయానికి పైత్యరస ఉత్పత్తికి నల్ల ఉప్పు సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలన నుంచి కూడా బయటపడేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను నియంత్రిస్తుంది.

కండరాల తిమ్మిరిని నివారిస్తుంది: నల్ల ఉప్పులో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కండరాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. 

రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది: అధిక రక్తపోటు లేదా మధుమేహులకు నల్ల ఉప్పు ఔషదంలాగే ఉపయోగపడుతుంది. ఇందుకంటే  దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

 బరువు తగ్గడానికి సహాయపడుతుంది: నల్ల ఉప్పు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది సోడియం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, శరీరంలో నీటి నిలుపుదలను కూడా నిరోధిస్తుంది.

మలబద్ధకాన్ని నివారిస్తుంది: నల్ల ఉప్పును నిమ్మరసం, అల్లంతో  కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గిపోతుంది. 

అలసటను తగ్గిస్తుంది: నల్ల ఉప్పు అలసటను పోగొట్టి రీఫ్రెష్ నెస్ ను తీసుకొస్తుంది. అంతేకాదు చర్మ పగుళ్లను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

తెల్ల ఉప్పు కంటే నల్ల ఉప్పే మంచిదా?

వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పునే వాడాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే తెల్ల ఉప్పు వివిధ దశల్లో ప్రాసెసింగ్ చేయబడుతుంది. కానీ నల్ల ఉప్పు అలా కాదు. అయితే తెల్ల ఉప్పు గడ్డలు కట్టకుండా ఉండటానికి సాధారణ లవణాన్ని కలుపుతారు. అయితే నల్ల ఉప్పును ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఇది కొన్ని రోజులకు గడ్డలుగా ఏర్పుడుతుంది. తెల్ల ఉప్పులో చేర్చే లవణాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.
 

 తెల్ల ఉప్పులో సోడియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అదే నల్ల ఉప్పులో అయితే సోడియం తక్కువ పరిమాణంలో ఉంటుంది.  సాధారణ లవణంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ లవణాలలోని ఖనిజాలు మన శరీరం అంత సులువుగా శోషించుకోలేదు. నల్ల ఉప్పులో ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. నల్ల ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది. తెల్ల ఉప్పు ఈ సమస్యలను పెంచుతుంది. అందుకే తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పునే వాడటం మంచిది. 

click me!