లోటస్ రూట్స్ ని కమల్ కక్‌డి అని కూడా పిలుస్తారు. ఇది ఒక వర్సటైల్ ఫుడ్. దీన్ని భారతీయ వంటకాలతో పాటు అనేక ఆసియా వంటకాల్లోనూ ముఖ్యంగా వాడతారు. వీటితో ఊరగాయల నుండి కూరలు, వేపుళ్ల వరకు అనేక రకాలు గా ఉపయోగిస్తారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. అయితే లోటస్ రూట్స్ లేదా కమల్ కక్ డి ఇంత ఆదరణ పొందడానికి కారణమేంటో తెలుసా?
లోటస్ రూట్స్ బురదలో పెరుగుతాయి. అందుకే చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు. దానివల్ల దీంట్లోని ఆరోగ్య ప్రయోజనాలు పొందకుండా అవుతారు. అయితే ఈ తామర వేళ్లు చాలా ఆరోగ్యకరమైనవి.. తినడానికి చాలా మంచివి. వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిన మరికొన్ని అంశాలు.. ఇక్కడ ఉన్నాయి..
అసలు లోటస్ రూట్స్ అంటే ఏంటీ.. పేరులోనే ఉంది లోటస్ అంటే తామర.. నీటిలో పెరిగే తామర వేళ్లు. వీటిని కడిగి శుభ్రం చేసి వాడతారు. ఈ వేళ్లు వెజిటబుల్ ఆకారం స్క్వాష్‌ని పోలి ఉంటుంది, దీన్ని ముక్కలుగా కోశాక దీని మధ్యలోని రంధ్రాల్లో మట్టి లేకుండా శుభ్రం చేస్తారు. తరువాత వంటకాల్లో వాడతారు. దీన్ని అనేక రకాలుగా వంటకాల్లో ఉపయోగిస్తారు.
దీని అసాధారణమైన రూపం.. కరకరలాడే ఆకృతి ఈ రూట్ వెజ్జీకి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. లోటస్ రూట్ తో రుచికరమైన వంటకాలను తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. జపనీస్, ఇతర విదేశీ వంటకాల్లో లోటస్ రూట్స్ ను సుగంధ ద్రవ్యాలతో కలిపి వండుతారు. అదే భారతీయ వంటకాల్లో లోటస్ రూట్ చిప్స్, కూరలు, కోఫ్తాలు లేదా ఊరగాయల రూపంలో వాడతారు.
జపాన్‌లో లోటస్ రూట్స్ ను వాటి ఔషధ గుణాలకోసం ఉపయోగిస్తారు. అందుకే లోటస్ రూట్స్ ముక్కలు సూప్‌లు, వంటకాలు, సలాడ్‌లలో ఆహారం రుచి పెంచడానికి అలంకారంగా వాడతారు. దీనా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా లోటర్ రూట్స్ ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
లోటస్ రూట్స్ ఇంత ఆరోగ్యకరంగా మారడానికి కారణమేంటి? వీటిలోని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ.. అంటే.. లోటస్ రూట్స్ లో విటమిన్లు, విటమిన్ బి 6, విటమిన్ సి, థియామిన్, పాంతోతేనిక్ యాసిడ్, జింక్, పొటాషియం, భాస్వరం, రాగి, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు లోటస్ రూట్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి.
అందుకే ఈ రూట్ వెజిటబుల్‌ను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. ఆరోగ్యకరమైన డైటరీ ఫైబర్స్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి అనారోగ్యాలను తగ్గిస్తుంది. చివరికి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. లోటస్ రూట్స్‌లో పొటాషియం ఉండటం వల్ల అది గొప్ప వాసోడైలేటర్‌గా మారుతుంది, ఇదిరక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ధమనులు మూసుకు పోకుండా నిరోధిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా ఏమిటంటే, లోటస్ రూట్స్‌లో పిరిడాక్సిన్ ఉండటం వల్ల రక్తంలోని హోమోసిస్టీన్ స్థాయిలను నిర్వహించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలర్జీలు, ఇన్ఫెక్షన్లను నయం చేయడంలో సహాయపడుతుంది. ఆహారంలో లోటస్ రూట్‌ను జోడించడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్‌లు, రింగ్వార్మ్, మశూచి, కుష్టు వంటి అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇంకా చెప్పాలంటే.. తామర ఆకులను అధిక చెమట, రక్తస్రావ రుగ్మతలు, ముక్కు నుంచి రక్తం కారడం.. మూత్రంలో రక్తం పడడం లాంటి వాటికి చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.
నిజానికి, విటమిన్ సి ఉండటం వల్ల లోటస్ రూట్స్ ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్‌ల వల్ల తయారవుతుంది. అనేక రుగ్మతలను నివారిస్తుంది. నయం చేస్తుంది. అయితే, దీంట్లోని ఔషధ ప్రయోజనాల కోసం లోటస్ ఎక్స్ట్రాక్ట్స్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా వైద్యులను ఓ సారి సంప్రదించడం మంచిది.