Rose : గులాబీ రేకులతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా..!

Published : Apr 21, 2022, 01:42 PM IST

benefits of rose petals: నిత్యం కొన్ని తాజా గులాబీ రేకులను తింటే మన శరీరంలో ఉండే మలినాలు తొలగడంతో పాటుగా వెయిట్ కూడా తగ్గుతారు. అందేకాదు అందం కూడా రెట్టింపు అవుతుంది. 

PREV
110
Rose : గులాబీ రేకులతో అందమే కాదు.. ఆరోగ్యం కూడా..!

ప్రేమికులకు గులాబీ పువ్వులు చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ప్రేమకు చిహ్నం ఇవే కాబట్టి.  అంతేకాదు వీటిని పూజలో కూడా ఉపయోగిస్తుంటారు. కమ్మని సువాసన కలిగి ఉండే గులాబీ పువ్వులు ఎన్నో ఔషద గుణాలను కలిగి ఉంటాయి. గులాబీలో ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. 
 

210

గులాబీ పువ్వుల నుంచి తీసిన నూనెలను Perfume లల్లో ఉపయోగిస్తుంటారు. ఇకపోతే రోజ్ వాటర్ కూడా ఎప్పటినుంచో వాడుకలో ఉంది. అయితే ఈ గులాబీ రేకులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

310

ఆరు టీ స్పూన్ల చొప్పున సోంపు గింజలను, గులాబీ రేకులను తీసుకోవాలి. వీటిని రెండు కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడపోసి చల్లారిన తర్వాత తాగాలి. రోజుకు రెండు సార్లు ఈ ద్రవానాన్ని తీసుకుంటే రక్తహీనత సమస్య తొలగిపోతుంది. 
 

410

నాలుగు టీ స్పూన్ల బాదం ఆయిల్ లో ఒక టీ స్పూన్ రోజ్ ఆయిల్ ను మిక్స్ చేసి ఉదయం, సాయంత్రం వేళ్లలో ఛాతి మీద మెల్లిగా మీద మెల్లిగా మసాజ్ చేస్తే నొప్పి వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 
 

510

గుండె దడ, ఆందోళన వంటి సమస్యలు తగ్గాలంటే ఒక కప్పు గులాబీ నీళ్లను తీసుకుని అందులో టీ స్పూన్ సోంపు గింజలను, ధనియాలు అరటీ స్పూన్ వేయాలి. అలాగే పది ఎండు ద్రాక్షలను కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంత నానబెట్టాలి. తర్వాతి రోజు ఉదయం వడపోసి తాగాలి. 
 

610

ఒక్కో టీ స్పూన్ చొప్పున రోజ్ వాటర్, ఉల్లపాయ రసం తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో కాటన్ బాల్స్ ను అద్ది.. కనురెప్పలపై పెట్టుకోవాలి. ఇలా చేస్తే కళ్ల మంట, దురద, ఎదురుదనం వంటి సమస్యలు మటుమాయం అవుతాయి. 
 

710

తీవ్రమైన తలనొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే రోజ్ వాటర్ లో శొంఠి పొడిని, తోక మిరియాల పొడిని ఒక్కో టీ స్పూన్ వేయాలి. దీన్ని పేస్టుగా తయారుచేసుకుని తలనొప్పి ఉన్న ప్లేస్ లో అప్లై చేస్తే .. నొప్పి క్షణంలో తగ్గుతుంది. 
 

810

ముఖంపై మొటిమలు, మంగు మచ్చలు పోయి .. ముఖం కోమలంగా తయారవ్వాలంటే.. రోజ్ వాటర్ లో బాదం పలుకులు, కుంకుమ పువ్వు వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. దీన్ని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 

910

అజీర్థి, వికారం, ఆమ్లపిత్తం, ఎసిడిటీ వల్ల ఎదురయ్యే ఛాతిలో నొప్పి తగ్గాలంటే.. గులాబీ రేకులను నానబెట్టిన నీళ్లలో కమలాపండ్ల రసం, సున్నపు తేటకు కలిపి తీసుకోవాలి. 

1010

అధిక బరువు నుంచి బయటపడాలంటే.. ఒక గ్లాస్ నీటిని తీసుకుని పది నుంచి పదిహేను గులాబీ రేకులను వేయాలి. ఈ నీటిని బాగా మరిగించాలి. అంటే నీరంతా గులాబీ రంగు వచ్చే వరకు మరిగిస్తూనే ఉండాలి. ఆ తర్వాత దీన్ని కిందికి దించుకుని అందులో చిటికెడు దాల్చిన చెక్క పౌడర్, కొద్దిగా తేనె ను వేసి తీసుకుంటే.. క్రమంగా బరువు తగ్గుతారు. 

click me!

Recommended Stories