Weight Loss Tips: ఈ ఆకుతో బరువు తగ్గడమే కాదు.. మధుమేహులకు కూడా సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా..

Published : May 14, 2022, 09:56 AM IST

Weight Loss Tips: బరువు తగ్గాలంటే మీరు తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా జామ ఆకులు బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడతాయి. 

PREV
19
Weight Loss Tips: ఈ ఆకుతో బరువు తగ్గడమే కాదు.. మధుమేహులకు కూడా సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా..

Weight Loss Tips: జామపండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. ఈ పండు టేస్ట్ గానే కాదు అంతకు మించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 

29

ఇక జామ కాయలే కాదు జామ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ కలుగుతాయో తెలుసా.. 

39

జామ ఆకుల ప్రయోజనాలు.. జామ ఆకులు మన శరీరానికి మేలు చేసే అనేక ఔషద గుణాలను కలిగి ఉంటాయి. మరి ఈ జామ ఆకుల ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

49

బరువును తగ్గించడానికి.. సంక్లిష్టమైన పిండిపదార్థం చక్కెరగా మారినప్పుడు వెయిట్ పెరుగుతుంటారు. అయితే జామ ఆకులు ఈ ప్రాసెస్ ను ఆపడానికి సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాదు ఈ జామ ఆకుల్లో కార్బోహైడ్రేట్లను తగ్గించే శక్తి కూడా ఉంది. అందుకే దీనిని తింటే స్థూలకాయం సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నారు నిపుణులు. 

59

విరేచనాలను తగ్గిస్తుంది.. డయేరియా(అతిసారం) సమస్యతో బాధపడేవారికి జామ ఆకులు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. ఇందుకోసం జామ వేర్లను ఒక గ్లాస్ నీటిలో మరిగించాలి. దీనిని రోజుకు రెండు సార్లు తాగితే పొట్ట సెట్ట అవుతుంది. విరేచనాలు మటుమాయం అవుతాయి. 

69

కొలెస్ట్రాల్ తగ్గుతుంది.. ఆయిలీ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాలంటే జామ ఆకుల టీ ని తాగాలి. రెగ్యులర్ గా జామ ఆకుల టీని తాగితే ఎల్ డిఎల్ గణనీయంగా తగ్గుతుంది. 

79

జుట్టుకు మంచిది.. జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అమ్రూక్ ఆకులను గ్రైండ్ చేసి తలకు అప్లై చేస్తే జుట్టు  సిల్కీగా తయారవుతుంది. 

89

మధుమేహులకు మంచిది.. జామ ఆకులతో తయారుచేసిన టీ  ఆల్పా గ్లూకోసిడేస్ ఎంజైమ్ క్యార్యకలాపాలను తగ్గిస్తుంది. దీంతో మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయ. వీరు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఈ టీని తాగితే మార్పును మీరే గమనిస్తారు. 

99

దంత సమస్యలు తగ్గుతాయి.. చిగుళ్ల వాపు, దంతాల నొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి జామ ఆకులు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇందుకోసం ప్రతిరోజూ జామ ఆకులను నములుతూ ఉండాలి. జామ ఆకులను తినడం వల్ల ఆకలి కూడా బాగా పెగుతుంది. అయితే జామ ఆకులను పేస్ట్ గా చేసుకుని దంతాలపై లేదా చిగుళ్లపై అప్లై చేస్తే.. నొప్పి, వాపు సమస్యలు మటుమాయం అవుతాయి. 
 

click me!

Recommended Stories