Lunar Eclipse 2022: ఈ ఏడాదిలో రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. మొదటి చంద్రగ్రహణం మే 16న, రెండవది 2022 నవంబర్ 8న ఏర్పడనున్నాయి. ఈ రెండూ సంపూర్ణ చంద్రగ్రహణాలే. ఇక ఈ మొదటి చంద్రగ్రహణం సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత ఏర్పడనుంది. ఇక ఈ చంద్రగ్రహణం రోజునే బుద్ద పూర్ణిమ కూడా.
Lunar Eclipse 2022
ఈ నెల 16 తారీఖున చంద్రగ్రహనం సరిగ్గా ఉదయం 07:02 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:20 గంటలకు ముగుస్తుంది. మరి ఈ చంద్రగ్రహణం గురించి మనం ప్రత్యేకించి కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది.. 2022 మే 16 న ఏర్పడే మొదటి చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. ఈ గ్రహణం కేవలం.. రుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది.
చంద్రగ్రహణ సమయం.. ఈ గ్రహణానికి తొమ్మిది గంటల ముందుగానే సూతకం మొదలవుతుంది. అంటే ఈ సూతకాలంలో ఎలాంటి శుభకార్యాలను చేయడానికి వీలులేదని జ్యోతిష్యులు, పండితులు చెబుతున్నారు. ఇక ఈ చంద్రగ్రహణం సమయంలో సూతకం ఆదివారం(15 వ తేది) నాడు 10:58 గంటలకు మొదలవుతుంది. ఇక ఇది మరుసటి రోజు (సోమవారం ) పొద్దున 11:58 గంటలకు ముగిసిపోతుంది. కానీ ఈ తొలి చంద్రగ్రహణం మన దేశంలో మాత్రం కనిపించదు. కాబట్టి ఇక్కడ సూతకాలం చెల్లదనే చెప్పలి. కానీ గ్రహణం కనిపించే దేశాల్లో మాత్రం సూతకాలం వర్తిస్తుంది.
చంద్రగ్రహణ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఈ గ్రహణం కనిపించే అంటే సూతకాలం వర్తించే ప్రదేశాల్లో గర్భిణులు ఇళ్ల నుంచి అస్సలు బయటకు రాకూడదు. అలాగే గ్రహణ సమయంలో పూజలు చేస్తూ విగ్రహాలను తాకకూడదు. ఇష్టదేవుడి నామ స్మరణ జపించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ గ్రహణం స్టార్ట్ కాకముందే మీరు తినే ఆహారాల్లో తులసి ఆకులను తప్పక వేయాలి. ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఇంటి నిండా గంగా జలం చల్లుకోవాలి. లేదంటే ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. గ్రహణం సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించడం మానుకోండి ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా, కత్తులు, ఫోర్క్ మరే ఇతర కోణాల మరియు పదునైన సాధనాలను ఉపయోగించవద్దు. చంద్రగ్రహణం తర్వాత అన్నదానం, వస్త్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. గ్రహణ కాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ఎలాంటి అరిష్టమైనా దూరం చేసుకోవచ్చు.