పిల్లల్ని కంటే చాలు.. లక్షాధికారి కావచ్చు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?

Published : Aug 26, 2026, 12:12 PM IST

మీరు పిల్లల్ని కంటే.. ప్రభుత్వం ఒక్కో బిడ్డకు ఏకంగా రూ.52లక్షలు ఇస్తుందా? మీరు ఎంత మంది పిల్లల్ని కంటే.. అంత మందికి డబ్బులు ఇచ్చేస్తుందా? ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏ దేశ ప్రభుత్వమో తెలుసా?

PREV
13
జస్ట్.. బిడ్డను కంటే చాలు..

పిల్లలను కనడం అనేది ఒక అందమైన అనుభూతి మాత్రమే కాదు.. ఇప్పుడు ఒక లక్షదికారిని చేసే రహదారి కూడా! "మీరు పిల్లలను కనండి.. వారిని పెంచే బాధ్యతలో రూ. 52 లక్షల ఆర్థిక సాయం మేము అందిస్తాం" అంటూ సింగపూర్ ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది..

23
ఇంత బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

ప్రపంచంలోనే అత్యధిక జీవన ప్రమాణాలు ఉన్న సింగపూర్ దేశం, తమ దేశంలో పడిపోతున్న జననాల రేటును పెంచడానికి 'SG Child Support Package' పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఒక దంపతులకు బిడ్డ పుడితే, ఆ పాప లేదా బాబు 17 ఏళ్ల వయస్సుకు వచ్చే వరకు మొత్తం 55,000 అమెరికన్ డాలర్లు (మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 52 లక్షల నుండి రూ. 55 లక్షల వరకు) సాయంగా అందజేస్తుంది.

లక్షల రూపాయిల సాయం ఎలా ఇస్తారు? ఈ మొత్తం డబ్బును ప్రభుత్వం ఒకేసారి చేతిలో పెట్టదు. బిడ్డ పెరుగుదలకు తగ్గట్టుగా విడతల వారీగా ఇస్తుంది:

బిడ్డ పుట్టగానే క్యాష్ గిఫ్ట్: పాప/బాబు పుట్టిన మొదటి ఏడాదే చేతికి దాదాపు రూ. 6.5 లక్షలకు పైగా నగదును రెండు విడతల్లో జమ చేస్తారు.

ఏటా అకౌంట్‌లో డబ్బులు: బిడ్డకు 1వ సంవత్సరం నుంచి 16 ఏళ్లు వచ్చేవరకూ ప్రతి ఏటా దాదాపు రూ. 1.3 లక్షల చొప్పున తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారు.

చదువు, వైద్యం ఉచితం: చైల్డ్ కేర్, బడి చదువులు, హెల్త్ ఇన్సూరెన్స్, 17 ఏళ్ల వయస్సు వచ్చాక ఉన్నత చదువుల (Higher Education) కోసం మిగతా భారీ ఫండ్‌ను కేటాయిస్తారు.

ఉచిత ఇల్లు & సెలవులు: ఇది చాలదన్నట్లు.. పిల్లలున్న దంపతులకు ప్రభుత్వ ఇళ్లు కేటాయించడంతో పాటు తల్లిదండ్రులిద్దరికీ ఎక్కువ రోజులు పెయిడ్ లీవ్స్ కూడా ఇస్తున్నారు!

33
ప్రభుత్వం ఇలాంటి ఆఫర్ ఎందుకు వచ్చింది?

అక్కడ జీవన వ్యయం, ఉద్యోగాల ఒత్తిడి ఎక్కువ కావడంతో నేటి యువత పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎంతగా అంటే.. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే సగటున 2.1 శాతం జననాల రేటు ఉండాలి, కానీ సింగపూర్‌లో అది కేవలం 0.87 శాతానికి పడిపోయింది.ముందు ముందు దేశంలో పనిచేసే యువత తగ్గిపోయి, అంతా వృద్ధులే మిగిలిపోతారనే భయంతో సింగపూర్ ప్రభుత్వం ఇలా 'రూ. 52 లక్షల' బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మరి.. ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్ తో అయినా మరి.. జనాభా రేటు ఈ దేశంలో పెరుగుతుందో లేదో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories