Goa Trip: వేసవి సెలవుల్లో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? అయితే గోవాకు మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. చాలా మంది గోవా అంటే ఖరీదైన ట్రిప్ అని భావిస్తారు. కానీ సీజన్‌ను సరిగ్గా ఎంచుకుంటే తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన అనుభవాన్ని పొందొచ్చు.
నవంబర్ నుంచి జనవరి వరకు గోవాలో టూరిస్టులు ఎక్కువగా ఉంటారు. ఆ సమయంలో హోటళ్లు, రిసార్ట్లు చాలా ఖరీదుగా ఉంటాయి. కానీ వేసవి కాలంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా రూ. 5000 ఉన్న రూమ్స్ వేసవిలో రూ. 2000 లోపే దొరుకుతాయి. హాస్టళ్లు, హోమ్‌స్టేలు ఇంకా తక్కువ ధరలో లభిస్తాయి. ఫైవ్‌స్టార్ రిసార్ట్స్ కూడా భారీ డిస్కౌంట్స్ ఇస్తాయి.
24
ట్రావెల్ ఖర్చు కూడా తగ్గుతుంది
వేసవిలో గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే ప్రయాణ ఖర్చు కూడా తగ్గుతుంది. స్కూటర్ రెంట్ రూ. 300 వరకు దొరుకుతుంది. పీక్ సీజన్‌లో ఇది రూ. 500 నుంచి రూ. 800 వరకు ఉంటుంది. రైలు, ఫ్లైట్ టికెట్లు కూడా తక్కువ ధరలో లభిస్తాయి. ఇలా ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులోనే మంచి సేవింగ్స్ చేసుకోవచ్చు.
34
రద్దీ లేకుండా బీచ్‌లను ఆస్వాదించండి
గోవాలో ప్రసిద్ధి చెందిన బీచ్‌లు కూడా వేసవిలో ప్రశాంతంగా ఉంటాయి. బాగా బీచ్, అంజునా బీచ్, కాలాన్‌గట్ బీచ్ సీజన్‌లో ఇవి జనంతో నిండిపోతాయి. కానీ వేసవిలో మీరు ప్రశాంతంగా కూర్చుని, మంచి ఫోటోలు తీసుకుని, రిలాక్స్ అవ్వచ్చు.
గోవా అంటే బీచ్‌లే కాదు… ఇంకా చాలా ఉంది. స్కూబా డైవింగ్, పారాసైలింగ్, కయాకింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ట్రై చేయొచ్చు. సాయంత్రం వేళల్లో గోల్డ్ గోవా, చర్చీలు సందర్శించండి. కోటలు, ఆలయాలు, స్థానిక సంస్కృతిని దగ్గరగా చూడొచ్చు.