అయితే ప్రేమికుల రోజు మొదటి రోజు అయిన 7 న రోజ్ డే అని జరుపుకుంటారు. ఇక మొత్తానికి ఈరోజు నుండి ప్రారంభం కాగా ఈరోజు తమకు అత్యంత ఇష్టమైన వారికి తమలో ఉన్న ప్రేమను తెలపటానికి ఉత్తరాలు, గిఫ్టులు, కవితలు వంటివి పంచుకుంటారు. అయితే గులాబీని పంచుకోటంలో కూడా ఒక ప్రత్యేక విశేషం ఉందని చెప్పాలి. మామూలుగా ప్రేమను తెలపటానికి ఎర్ర గులాబీయే కాకుండా.. రకరకాల రంగుల గులాబీలను కూడాఇచ్చుకుంటారు. అయితే ఒక్కొక్క రంగు గులాబీకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది.