రోజ్ డే కు మీ భాగస్వామిని సర్ ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ గిఫ్ట్ లు ఇచ్చేయండి

First Published Feb 7, 2023, 10:52 AM IST

వాలెంటైన్ వీక్ కు బలే క్రేజ్ ఉంటుంది. ఈ వారమంతా ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ రోజు రోజ్ డే కాబట్టి భాగస్వాములను సర్ ప్రైజ్ చేయడానికి ఎలాంటి గిఫ్ట్ లు ఇవ్వాలో తెలుసా..  


వాలెంటైన్ వీక్ మొదలైంది. ఇంకేముంది ఈ వారమంతా ఒకరినొకరు సర్ప్రైజ్ చేయడానికి, వారిని ఆకట్టుకోవడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల బహుమతులును ప్రజెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ రోజు రోజ్ డే కాబట్టి రోజ్ లనే ఎక్కువగా ఇచ్చిపుచ్చుకుంటారు. మరి మీ భాగస్వామిని ఇంకొన్ని ఇతర బహుమతులతో సర్ ప్రైజ్ చొయొచ్చు. అవేంటేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రిజర్వ్డ్ రోజెస్

పిజర్వ్డ్ రెజెస్ మీ భాగస్వామిని బలే ఆకట్టుకుంటాయి. ఈ గులాబీలు మీ ఇంటిని అందంగా మార్చడాని, మంచి వాసనతో నింపడానికి బాగా ఉపయోగపడతాయి కూడా. ఇవి ఎక్కువ రోజులు వాడిపోకుండా, రాలిపోకుండా ఉంటాయి. ఈ పువ్వులు మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేస్తాయి. అందులోనూ గులాబీలు ప్రేమకు చిహ్నం. ఆదర్శవంతమైన బహుమతి కూడా. ఈ ప్రత్యేకమైన పూలు మీ ప్రేమకు చిహ్నాలుగా నిలుస్తాయి. 

ప్రేమ లేఖతో గులాబీ పూలు

ప్రేమలేఖలు ఇప్పుడు కరువయ్యాయి కానీ.. ఒకప్పుడు వాటితోనే ప్రేమికులు మాట్లాడుకునేవారు. ఊసులు చెప్పుకునే వారు. అందుకే ఈ రోజ్ డే సందర్భంగా గట్టి పేపర్ తో హ్యాడ్ మేడ్ బాక్స్ ను తయారుచేసి అందులో గులాబీ పువ్వులు, మీ ప్రేమ లేఖను పెట్టి గిఫ్ట్ గా ఇవ్వండి. గుర్తుంచుకోండి ఈ లేఖలో ఆమెతో మీకున్న తీయని అనుభూతులను రాయండి. ఎర్రని గులాబీలు, మీ చేతిరాత మీ భాగస్వామిని బలే ఆకట్టుకుంటాయి. మీపై ప్రేమను మరింత పెంచుతాయి. 

రోజ్ బొకే

రోజ్ డే కోసం అత్యంత ప్రాచుర్యం పొందిన బహుమతుల్లో గులాబీ బొకేలు ఒకటి. పువ్వులను స్నేహితులకు,  ప్రియమైన వారికి ఇస్తుంటారు. ఇవి వారి మధ్య బంధాన్ని పెంచుతాయి. బలోపేతం చేస్తాయి. మనసులో ఉన్న ఫీలింగ్స్ ను చెప్పడానికి గులాబీలను ఇలా బహుమతిగా ఇవ్వడం ఉత్తమ మార్గం తెలుసా? 
 

Image: Getty Images

లవ్ హ్యాంపర్స్

వాలెంటైన్స్ డే రోజున చాలా మంది తమ భాగస్వామికి ఒకటి కంటే ఎక్కువ బహుమతులను ఇవ్వాలనుకుంటారు. ఇలా ఒకటికి మించి గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్లు చాక్లెట్లు, పువ్వులు, టెడ్డీలు, ఫ్రేమ్లు, మగ్స్, కార్డులు వంటివి ఇస్తే మీ భాగస్వామి హ్యాపీగా ఫీలవుతారు. 
 

Image: Getty Images

వాలెంటైన్స్ కార్డులు

మీకెంతో ప్రత్యేకమైన, ఇష్టమైన వారికి హ్యాండ్ మేడ్ వాలెంటైన్స్ డే కార్డుడును బహుమతిగా ఇవ్వడం కంటే ఇంకా గొప్పది ఏదీ ఉండదేమో. అవును మీ చేతులతో తయారుచేసిన కార్డులు అవతలి వ్యక్తికి మీ ప్రేమను తెలియజేస్తాయి. బంధాలు, భావాలు, భావోద్వేగాలు వంటి వాటిని ఇవి సూచిస్తాయి. అందుకే చేతితో తయారుచేసిన కార్డులను బహుమతిగా ఇవ్వండి. దీనిలో తనపై ఉన్న ప్రేమను కొన్ని అక్షరాల రూపంలో తెలియజేయండి.
 

click me!