ముద్దు నాలుగు పెదాల కలయికే కాదు.. మనసులోని భావాలను చెప్పే మధురమైన అనుభూతి కూడా. ముద్దు కొద్దిసేపటి వరకే పెట్టుకున్నా.. ఇది ఆ జన్మకు సరిపోయే భావాలను చెబుతుంది. పెదాల స్పర్శ మీ భాగస్వామి ప్రేమను, ఆప్యాయను మీకు తెలియజేస్తుంది. స్వచ్ఛమైన ప్రేమకు మాటలు అవసరం లేదు. అందుకే మాటలు కరువైనప్పుడు ఇలా ముద్దు రూపంలో చెప్పేస్తుంటారు చాలా మంది. ముద్దును అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదండీ. ఎందుకంటే ఇదే మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్తుంది. అలా చాలా మంది లిప్ కిస్ ను ఎప్పుడూ పెడుతుంటారు. కానీ ముద్దును ఎన్నో రకాలుగా పెట్టొచ్చు. అవును ఫ్రెంచ్ కిస్, అమెరికన్ కిస్ అంటూ ఎన్నో రకాల ముద్దులున్నాయి. వాటిని కూడా ట్రై చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..