ఉల్లికాడలను తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

First Published | Feb 11, 2023, 4:58 PM IST

చలికాలంలో ఉల్లికాడలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వీటిలో జింక్, భాస్వరం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఉల్లికాడలు మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా డయాబెటీస్ ను కూడా నియంత్రిస్తాయి. 

Spring onion

చలికాలంలో రోగాలు రాకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. మీకు తెలుసా? చలికాలపు రోగాలను రాకుండా అడ్డుకునేందుకు ఉల్లికాడలు సహాయపడతాయి. ఉల్లికాడలు రుచిగా ఉండటమే కాదు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. చలికాలంలో సూప్ లు, గ్రేవీలు, ఇతర వంటకాల్లో ఉల్లికాడలను వేస్తుంటారు. అసలు ఉల్లికాడలు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉల్లికాడల్లో ఉండే పోషకాలు

ఉల్లికాడల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, థయామిన్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు వీటిలో మెగ్నీషియం, రాగి, జింక్, భాస్వరం, ఫైబర్ లు కూడా ఉంటాయి. ఉల్లికాడలు ఫ్లేవనాయిడ్లకు మంచి వనరు. దీనిలో సల్ఫర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గు, జలుబు నుంచి తొందరగా ఉపశనం కలిగిస్తాయి. 
 

Latest Videos


ఉల్లికాడలు క్యాన్సర్ నిరోధక ఏజెంట్ గా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మన ఆహారంలో చేర్చుకోవడం వ్లల ఎన్నో రకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. 

కళ్లను రక్షిస్తుంది

ఉల్లికాడలు కెరోటినాయిడ్లు, విటమిన్ ఎ కు ప్రధాన వనరు. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చూపు కోల్పోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి సమస్యలకు చెక్ పెడుతుంది. 
 

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఉల్లికాడలు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాదు ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షించడానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

ఉల్లికాడల్లో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాదు దీని వాడకం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది.
 

ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం

ఉల్లికాడలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిజానికి ఉల్లికాడలు మన ఆకలిని పెంచడానికి కూడా సహాయపడతాయి. చైనీస్ ఫుడ్స్ లో విరివిగా వాడే ఈ ఫుడ్ డయేరియా, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 


ఉల్లికాడల్లో పోషక స్థాయి

నిపుణుల ప్రకారం.. ఉల్లికాడల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె  లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందిస్తుంది.  దీనిలో కార్బోహైడ్రేట్లు 7.34 గ్రా, చక్కెర 2.33 గ్రా,  ప్రోటీన్ 1.83 గ్రా,  ఫైబర్ 2.6 గ్రా,  పొటాషియం 276 మి.గ్రా, కాల్షియం 72 మి.గ్రా, ఫాస్ఫరస్ 37 మి.గ్రా, మెగ్నీషియం 20 మి.గ్రా, ఐరన్ 1.48 మి.గ్రా, సోడియం 16 మి.గ్రా, జింక్ 0.39 మి.గ్రా, రాగి 0.083 మి.గ్రా ఉంటుంది. 

click me!