Happy Friendship Day 2022: పేద, ధనిక, ముసలి.. ముటక అంటూ ఎలాంటి భేద.. భావాలు లేకుండా నిస్వార్థంగా ఉండే ప్రేమ బంధం ఏదైనా ఉందంటే.. అది ఒక్క ఫ్రెండ్ షిప్ అనే చెప్పాలి. ఈ ఫ్రెండ్ షిప్ కు వయసుతో సంబంధం ఉండదు. ఉండేదల్లా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అందుకే అంటారు.. ఒక మంచి దోస్త్ వంద మందితో సమానమని. ఫ్రెండ్ షిప్ ను రిలేషన్ పోల్చలేం. ఎందుకో తెలుసా.. ఇది అంతకంటే ఎక్కువ. సంతోషం, బాధ, దు:ఖం, ఆనందం అంటూ ప్రతి భావేద్వేగంలో దోస్త్ అండగా ఉంటాడు. కష్టం వస్తే ఇంటోళ్లు.. కాదు ముందు గుర్తొచ్చేది దోస్త్ యే. అందుకే ఇలాంటి దోస్త్ కోసం ఒక ప్రత్యేక మైన రోజు పుట్టుకొచ్చింది.