Friendship Day: చిన్ననాటి స్నేహితులకు దూరమయ్యారా..? మళ్లీ ఇలా కనెక్ట్ అవ్వండి..!

Published : Aug 07, 2022, 07:18 AM IST

మనకు జీవితంలో వచ్చే అడ్డంకుల వల్ల స్నేహాన్ని కొనసాగిండచం పెద్ద పనిగా మారుతుంది. అయితే.. చిన్న నాటి స్నేహాన్ని పెద్దయ్యాక మళ్లీ మొదలుపెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

PREV
17
Friendship Day: చిన్ననాటి స్నేహితులకు దూరమయ్యారా..? మళ్లీ ఇలా కనెక్ట్ అవ్వండి..!
Image: Getty Images

చిన్న తనంలో మనకు స్నేహితులు తప్ప.. మరో ధ్యాస ఉండదు. వయసు పెరిగిన తర్వాత మన పెళ్లి, పిల్లలు, ఉద్యోగం, జీవితం, ఒత్తిడి, కెరిర్ ఇలా రకరకాల కారణాల వల్ల స్నేహితులకు దూరమైపోతూ వస్తున్నాం. అయితే.. అందరూ అలా దూరం కాకపోవచ్చు. కొందరు ఇప్పటికీ స్నేహితులతో టచ్ లో ఉండి ఉండొచ్చు. అయితే.... కరోనా మహమ్మారి తర్వాత.. టచ్ లో ఉన్నవారు సైతం కాస్త దూరమయ్యారనేది వాస్తవం. కొందరు పూర్తిగా దూరం కాకపోయినా.. వ్యక్తిగతంగా కలుసుకోలేక వీడియోకాల్స్, మెసేజ్ లతో మాట్లాడుకుంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
 

27
Image: Getty Images

నిజానికి.. మనం అందరితోనూ స్నేహాన్ని జీవితాంతం కొనసాగించలేం. కొందరితో పులిస్టాప్ పడితే.. కొందరితో కొత్త స్నేహాలు మొదలౌతాయి. మనకు జీవితంలో వచ్చే అడ్డంకుల వల్ల స్నేహాన్ని కొనసాగిండచం పెద్ద పనిగా మారుతుంది. అయితే.. చిన్న నాటి స్నేహాన్ని పెద్దయ్యాక మళ్లీ మొదలుపెట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

37
Image: Getty Images

దూరమైన మీ పాత స్నేహితులను కలుసుకోవాలని మీకు అనిపించవచ్చు. అలా అనిపించినప్పుడు.. వారిని కలుసుకోవడానికి ముందుగా మీరు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించిన తర్వాత... వారి ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవాలి. ఇంతకాలం మీరు వారికి దూరం కావడానికి గల కారణాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. మీ స్నేహం విలువ, ప్రాముఖ్యతను వారికి తెలియజేయాలి.
 

47
Image: Getty Images

చిన్నప్పటి స్నేహం వేరు... పెద్దయ్యాక ఆ స్నేహాన్ని కొనసాగించడం వేరు. ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. పెళ్లి తర్వాత చాలా మంది జీవితాలు మారిపోతాయి. కాబట్టి.. మీకు మళ్లీ పాత స్నేహం కొనసాగించాలి అనిపించింది కదా అని ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు. వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో.. వారి బౌండరీస్ ఎంటో తెలుసుకోవాలి. వారు మీతో మళ్లీ స్నేహాన్ని కొనసాగించేందుకు వీలుగా ఉన్నారో లేదో చూడాలి. వారి బౌండరీస్ ని మీరు కచ్చితంగా అర్థం చేసుకొని.. అందుకు తగినట్లుగా ప్రవర్తించాలి..
 

57
Image: Getty Images

ఇక మీ చిన్ననాటి స్నేహితులతో చాలా కాలం తర్వాత కనెక్ట్ అయ్యినప్పుడు.. వారితో చాలా మాట్లాడాలి అని అనిపిస్తూ ఉంటుంది. తప్పులేదు.. వీలు చూసుకొని ఇద్దరూ మాట్లాడుకోవాలి. మీరు ఒకరితో మరొకరు మాట్లాడుకున్నప్పుడు మీ స్నేహం స్వచ్ఛత, బంధం బయటపడతాయి. మరింత బలపడతాయి కూడా. ఈ స్నేహం మరింత గాఢంగా మారుతుంది.
 

67
Image: Getty Images

ఏ సంబంధం అయినా దృఢంగా ఉండాలంటే అందుకు మన కృషి అవసరం. అందులో స్నేహాలు కూడా ఉంటాయి. మీరు మీ స్నేహాన్ని పునరుద్ధరించుకోగలిగితే, వారు మొదట విడిపోవడానికి గల కారణాలను గుర్తుంచుకోండి. మీ స్నేహితులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా మీరు నిజాయితీగా ఉండాలి.

77
Image: Getty Images

స్నేహాన్ని పునరుద్ధరించడానికి మీ ఉత్తమ ప్రయత్నాలు విఫలమైతే, నష్టాన్ని అంగీకరించండి. సంబంధాన్ని పునరుద్ధరించడానికి మీ స్నేహితుడిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయకూడదు. కేవలం మీరు వారితో మళ్లీ పాత స్నేహం చేయాలనుకుంటన్న విషయాన్ని చెప్పడం మాత్రమే. మీతో మళ్లీ స్నేహం చేయడానికి వారికి అంగీకారమో కాదో.. వారు చెప్పే వరకు వేచి ఉండటంలోనూ తప్పులేదు. 
 

click me!

Recommended Stories