Friendship day: ఈ ఫ్రెండ్ కి ఇలా సర్ ప్రైజ్ ఇవ్వండి..!

First Published Aug 7, 2022, 8:27 AM IST

 ప్రపంచంలోని అత్యంత షరతులు లేని సంబంధాలలో స్నేహం ఒకటి. స్నేహితులు మన జీవితాలను మరింత అందంగా మార్చుకుంటారు. కష్టాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ మన పక్కన ఉండే వారే నిజమైన స్నేహితులు.  స్నేహితులు మన జీవితాలకు అదనపు ఆనందాన్ని, అర్థాన్ని తెస్తారు.
 

Image: Getty Images

నేడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఫ్రెండ్ షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులకు, అన్ని అందమైన స్నేహాలకు అంకితమైన రోజు ఆగస్టు 7న జరుపుకుంటారు. భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు నెల మొదటి ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున అందరూ తమ స్నేహితులతో కలపాలని అనుకుంటూ ఉంటారు . 

ప్రపంచంలోని అత్యంత షరతులు లేని సంబంధాలలో స్నేహం ఒకటి. స్నేహితులు మన జీవితాలను మరింత అందంగా మార్చుకుంటారు. కష్టాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ మన పక్కన ఉండే వారే నిజమైన స్నేహితులు.  స్నేహితులు మన జీవితాలకు అదనపు ఆనందాన్ని, అర్థాన్ని తెస్తారు.

Friends are also a good doctor in our lives!

ప్రతి ఒక్కరూ ఈ రోజున స్నేహితులతో గడపాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే డౌట్ ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఈ కింద టిప్స్ తో.. మీరు మీ స్నేహితుల దినోత్సవాన్ని మీ స్నేహితులతో ఆనందంగా గడిపేయండి.

గ్రీటింగ్స్ కార్డ్: చేతితో తయారు చేసిన బహుమతులు ఎప్పుడూ స్పెషల్ గా ఉంటాయి . కార్డ్‌లో స్నేహితులుగా మారడం మొదలు మీరిద్దరూ కలిసి ప్రయాణించిన జీవితాన్ని కనిపించేలా చేయాలి. మీ ఇద్దరి ప్రయాణాన్ని ఈ కార్డులో పొందుపరచాలి.  ఇది ఖచ్చితంగా మీ స్నేహితుడి చిరునవ్వుకి కారణం అవుతుంది.

Image: Getty Images

ఫోటోబుక్: ఫోటోగ్రాఫ్‌లలో సంగ్రహించిన అన్ని జ్ఞాపకాలతో స్క్రాప్ పుస్తకాన్ని రూపొందించండి. మీ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలతో స్క్రాప్ బుక్ ని తయారు చేయాలి. ఆ ఫోటోల కింద మీరు సరదాగా ఫన్నీ కామెంట్స్ రాసి పెట్టండి. మీ స్నేహితులకు కచ్చితంగా నచ్చుతుంది.. ఇది మీ ఫ్రెండ్ బెస్ట్ గిఫ్ట్ గా మారుతుంది.

Image: Getty Images

బహుమతిని కొనండి: మీ స్నేహితుడికి బహుమతిని ఆర్డర్ చేయండి. మీ ఫ్రెండ్ కి నచ్చిన బహుమతిని కొని మీ చేతితో స్వయంగా ఇవ్వండి. తద్వారా వారు  దానిని చూసిన ప్రతిసారీ, అది మీకు గుర్తుచేస్తుంది.
 

Image: Getty Images

సడెన్ టూర్ : మీ స్నేహితులకు కాల్ చేసి, వెంటనే సడెన్ గా టూర్ కి ప్లాన్ చేయండి. ఇద్దరూ కలిసి చిన్నప్పుడు కలిసి తిరిగిన ప్రాంతాలకు వెళ్లడం లాంటివి చేయాలి. ఇవి చాలా సరదాగా ఉంటాయి. లేదంటే.. మరో కొత్త ప్లేస్ కి టూర్ వెళ్లండి. ఈ సర్ ప్రైజ్ మీ స్నేహితులకు బాగా నచ్చుతుంది. ఆ టూర్ లో.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త జ్ఞాపకాలు చేసుకుంటూ రోజు గడపండి.
 

Image: Getty Images

డిన్నర్ డేట్: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో డిన్నర్ డేట్‌కి వెళ్లండి. మీరు కలిసి పంచుకున్న సమయం, ఎప్పటికీ అనుసరించే సమయం గురించి రాత్రంతా మాట్లాడండి.

Image: Storyblocks

పిక్నిక్... మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి.. ఏదైనా పిక్నిక్ కి వెళ్లండి. సరదాగా అందరూ కలిసి గాసిప్స్ మాట్లాడుకోండి. అందరూ కలిసి గతంలో మీరు సరదాగా గడిపిన విషయాలను గుర్తుచేసుకోండి.
 

వర్చువల్ మీట్... ఇక చాలా మంది ఒకే దగ్గర ఉండకపోవచ్చు. అలాంటప్పుడు.. మీరు వర్చువల్ మీట్ ఏర్పాటు చేసుకొని.. అందరూ వీడియో కాల్ లో మాట్లాడుుకోవడం లాంటివి చేయాలి.

click me!