జుట్టును అతిగా దువ్వితే అంతే సంగతులు..

Published : Feb 03, 2022, 01:53 PM IST

జుట్టు పొట్టిగా ఉన్నా.. పొడుగ్గా ఉన్నా.. కేశ సంరక్షణ లేకపోతే మీ జుట్టు పని అంతే ఇక. ముందే ప్రస్తుత కాలంలో అందరి జుట్టు విపరీతంగా రాలిపోతోంది. దానికి తోడు జుట్టుకు ఎలాంటి శాంపూలు పెట్టాలి. ఎలాంటి నూనెలు వాడాలి.. జుట్టును ఎలా కాపాడుకోవాలి.. ఎలా దువ్వాలి వంటి అన్ని విషయాల్లో సందేహాలే ఉన్నాయి. మరి మీ కురులు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలంటే మాత్రం కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాల్సిందే.   

PREV
14
జుట్టును అతిగా దువ్వితే అంతే సంగతులు..

ముఖారవిందానికి కళ తెచ్చే వాటిలో కురులే ముందుంటాయి. అలాంటి కురులను కాపాడుకోవాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలను తప్పక పాటించాల్సిందే. ముందే ప్రస్తుత కాలంలో ఆడవారు, మగవారంటూ తేడా లేకుండా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి మార్కెట్లో లభించే రకరకాల శాంపూలు, నూనెలు వాడుతూ ఉన్న జుట్టు కాస్త ఊడేలా చేసుకుంటున్నారు. ఇటువంటి సమస్యల మధ్యన జుట్టు సంరక్షణ ఎలా? వాటి పోషణ ఎలా?ఏ ఆయిల్ వాడాలి? ఎలా దువ్వాలి? ఏ షాంపూను పెట్టాలి..వంటిది ప్రతీది సందేహంగానే మారుతోంది. జుట్టు పొడుగుదైనా, పొట్టిదైనా జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోకపోతే మాత్రం మీ జుట్టు పల్చబడే ప్రమాదం ఉంది. అందుకని జట్టు సంరక్షణ చర్యలు తప్పక ప్రతిరోజూ పాటించాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం..

24

అతిగా దువ్వడం:  జుట్టు సంరక్షణ చర్యలలో ప్రతి ఒక్కరూ చేసే సాధారణమైన తప్పు జుట్టును అతిగా దువ్వడం. మాడుకు బ్లడ్ సర్క్యూలేషన్ బాగా జరుగుతుందని, కేశాలు మెరుస్తాయని చాలా మంది జుట్టును విపరీతంగా దువ్వుతూనే ఉంటారు. అతిగా దువ్వితే మొదటికే మోసం వస్తుంది. జుట్టును ఎనిమిది నుంచి తొమ్మిది సార్లకంటే ఎక్కవ సార్లు దువ్వితే.. జుట్టు లాగినట్టుగా అనిపిస్తుంది. దాంతో కుదుళ్లు పట్టును కోల్పోతాయి. అంతేకాదు జుట్టు కొసలు చిట్లిపోతాయి. ముఖ్యంగా జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కర్లీ  హెయిర్, ఒత్తుగా ఉండే జుట్టున్న వాళ్లు వెడళ్పు పళ్లున్న దువ్వెనలే వాడాలి. కాగా కొందరి జుట్టు ఊరికూరికే చిక్కులు పడుతూ ఉంటాయి. అలాంటి బ్రష్ ను వాడాలి. వారి హెయిర్ స్టైల్ ను బట్టి దువ్వెన ఎంచుకుంటే జుట్టు అంతగా ఊడే ప్రమాదముండదు. 
 

34

వెంట్రుకలు చిట్లితే: హెయిర్ చిన్నగా ఉన్నా.. పెద్దగా ఉన్నా జుట్టు కొసలు చిట్లిపోతుంటాయి. అందుకోసమే జుట్టును కొంతకాలం తర్వాత కట్ చేస్తూ ఉండాలి. అంతేకాదు జుట్టును కట్ చేయడాన్ని వాయిదా వేస్తుంటే కూడా హెయిర్ డ్రై అయ్యే ప్రమాదముంది. అందులోనూ పొట్టి జుట్టు ఉన్నవాళ్లకు తమ జుట్టు పెరిగిందో లేదో తెలియదు కానీ పొడుగు జుట్టున్న వాళ్లకు బాగా తెలుస్తుంది. అంతేకాదు పొడుగు జుట్టున్నవాళ్ల జుట్టు కొసలు ఎక్కువగా చిట్లి పోతుంటాయి. అందుకే రెండు నెలలకోసారైనా హెయిర్ ట్రిమ్ చేయించుకోవడం మర్చిపోవద్దు. అయితే ఒకసారి జుట్టు చిట్లిపోయిన తర్వాత ఏ నూనె వాడినా, ఏ షాంపూ పెట్టినా.. జుట్టు సెట్ కాదు.

44

ఈ రోజుల్లో కూడా జుట్టుకు నూనె పెడితే దానిని చాదస్తమని కొందరు అంటూ ఉంటారు. వాస్తవానికి జుట్టుకు నూనె పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కి నూనె చక్కటి ఔషదంలా పని చేస్తుంది. అందుకే తలస్నానం చేసేముందు గోరు వెచ్చని నూనెను మాడుకు పెట్టడం వల్ల అది జుట్టుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. కొబ్బరి లేదా, నువ్వుల నూనె, ఆలివ్ ఆయిల్ పెట్టడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories