ప్రెగ్నెన్సీ సమయంలో జుట్టు రాలకుండా చేసే చిట్కాలివిగో..

First Published | Feb 1, 2022, 12:50 PM IST


చాలా మందికి ఆడవారికి ఇతర సమయాల్లో కంటే.. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది గర్భిణులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. కానీ ఈ సింపుల్ చిట్కాల ద్వారా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ప్రెగ్నెంగ్ గా ఉన్న సమయంలో మహిళలు ఎన్నో సమస్యల బారిన పడుతూ ఉంటారు. కాళ్లు వాపు రావడం, డార్క్ సర్కిల్స్ వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులుగా ఉన్న సమయంలోనే జుట్టు విపరీతంగా రాలుతుంది. అంతేకాదు జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణం హార్మోన్లలో వచ్చే హెచ్చు తగ్గులు. సరైన ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఫుడ్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే జుట్టుని చల్లటి నీళ్లతో వాష్ చేసి కండీషనర్ వాడితే చక్కటి ఫలితం ఉంటుంది. అయితే ఆ సమయంలో వచ్చే హెయిర్ ఫాల్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోకపోతే మీ జుట్టు పల్చగా మారే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ హెయిర్ ఫాల్ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. 
 

పోషకవిలువలున్న ఆహారం:  Antioxidants పుష్కలంగా లభించే ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి ఆహార పదార్థాల వల్లే ఆరోగ్యం బాగుంటుంది. ఆపిల్, స్ట్రాబెర్రీ, రాజ్మా వంటి ఆహారాలు జుట్టును బలంగా ,  దృఢంగా  చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది. 
 

Latest Videos


జుట్టును ఎలా శుభ్రపరచాలి:  జుట్టు విషయంలో చాలా మంది చేసే సర్వసాధారణమైనా, అతిపెద్ద తప్పు ఏదైనా ఉందా అంటే అది జుట్టును శుభ్రం చేయడంలోనే జరుగుతుంది. జుట్టును శుభ్రం చేయడంలో చేసే మిస్టేక్స్ వల్లే హెయిర్ దెబ్బతింటుంది. ప్రతిరోజూ జుట్టుకు శాంపూ పెట్టకూడదు. మురికిగా అనిపిస్తేనే జుట్టుకు శాంపూను అప్లై చేయాలి. అలాగే జుట్టుకు కండీషనర్ ను వాడుతూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు రాలిపోదు సరికదా.. ఇంకా అందంగా మారుతుంది. 

జుట్టును గట్టిగా ముడివేయడం, లాగడం వంటి కారణాల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. అందుకని జుట్టు విషయంలో ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఇలాంటి కారణాల వల్లే హెయిర్ ఫాల్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 


గర్భిణుల జుట్టు దృఢంగా చేయడంలో విటమిన్ సప్లిమెంట్స్ ను బాగా ఉపయోగపడతాయి. అందుకే గర్భిణులు తమ రోజు వారి ఆహారంలో విటమిన్ బి, సి లు ఉండేట్టు చూసుకోవాలి. వీటితో వారు ఆరోగ్యంగా ఉండటమే కాదు.. వారి జుట్టు కూడా ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. 

జుట్టుకు తరచుగా రంగులు వేయడం, Straightening చేయడం వల్ల కూడా జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జుట్టుకు రంగులు వేయడం మానుకోండి. తప్పదు అని భావించినప్పుడు మాత్రమే రంగులు వేయండి. అంతేకానీ.. తరచుగా స్టైల్ కోసం రంగులు వేస్తే మాత్రం జుట్టు ఊడిపోవడం పక్కాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్బుతమైన చిట్కాలతో హెయిర్ ఫాల్ సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. అయితే  ఈ సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తేనే ఆరోగ్యంతో పాటుగా జుట్టు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంతేకాదు మీ కురులు పట్టుకుచ్చులా మెరిసిపోతాయి.  

click me!