జుట్టు పెరగాలంటే ఈ ఆయుర్వేద మూలికలను బాగా ఉపయోగపడ్తయ్..

First Published Nov 17, 2022, 11:09 AM IST

ఈ రోజుల్లో చాలా మంది బట్టతల, హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు మీ జుట్టును వేగంగా పెంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

మీకు తెలుసా.. మన నెత్తిమీద సగటున 1,00,000 వెంట్రుకలు పెరుగుతాయి. అయితే కొన్ని రోజులకు పాత వెంట్రుకలు రాలిపోతాయి. కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. ఈ చక్రం ఇలాగే తిరుగుతూనే ఉంటుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం.. రోజుకు 50 నుంచి 100 వెంట్రుకలు ఊడిపోవడం చాలా సహజం. ఏదేమైనా..వయసు, లింగం బట్టి జుట్టు రాలిపోతుంది. బట్టతల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి, కాలుష్యం, కాలాల మార్పులు, జీవనశైలి మార్పులు వంటివి జుట్టును రాలేలా చేస్తాయి. అయితే కొన్ని రకాల ఆయుర్వేద మూలికలు జుట్టు బలంగా పెరిగేందుకు  సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మన శరీరంలో త్రిదోష  అసమతుల్యత వల్ల జుట్టు రాలిపోతుందని ఆయుర్వేదం చెబుతోంది. పోషకాహార లోపాలు, హార్మోన్ల అసమతుల్యత, చుండ్రు, రసాయన చికిత్సలు హెయిర్ ఫాకు కు కారణనమవుతాయి. అతేకాదు కొత్త వెంట్రుకలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. 

ఉసిరి

భారతీయ గూస్ బెర్రీ ఉసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, క్రియాశీల ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ నెత్తిమీద పోషణను అందిస్తాయి. అలాగే జుట్టు తంతువులను బలోపేతం చేస్తాయి. ఉసిరిలో ఉండే ఆవశ్యక కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు చుండ్రుతో పోరాడటానికి, నెత్తిమీద నుంచి జిడ్డును, మురికిని తొలగించడానికి సహాయపడతాయి. 

ఉసిరి సారం ఎక్కువగా ఉండే నూనెను జుట్టుకు పెట్టి మసాజ్ చేయడం వల్ల నెత్తిమీద రక్తప్రసరణ మెరుగుపడుతుంది.  ఇది మీ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది మీజుట్టు సహజరంగు కోల్పోకుండా చూస్తుంది. తెల్లబడటాన్ని  నివారిస్తుంది. 
 

భృంగ్ రాజ్ 

భృంగ్ రాజ్ను ఫాల్స్ డైసీ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది మీ జుట్టును తేమగా ఉంచుతుంది. దీనిలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టు పోషణకు అవసరమైన గుణాలు దీనిలో ఉంటాయి. ఈ హెర్బ్ లో ఫైటోస్టెరాల్స్, ఫ్లేవనాయిడ్లు జుట్టును వేగంగా పెంచుతాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతాయి. నెత్తిమీద, జుట్టు మూలాలలో రక్తప్రసరణను పెంచుతుంది. ఇది మీ జుట్టు సహజంగా పెరిగేందుకు ఫోలికల్స్ ను సక్రియం చేస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి సంక్రమణను నివారించడానికి, చండ్రును నియంత్రించడానికి సహాయపడతాయి. 

మెంతులు

మెంతుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మెంతులను రాత్రంతా నానబెట్టి పొద్దున్న మెత్తని పేస్ట్ లా చేసి మాడుకు అప్లై చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ పేస్ట్ లో ఉండే ప్రోటీన్, ఇనుము మీ జుట్టుకు పోషణను అందిస్తాయి. జుట్టు వేగంగా పెరిగేందుకు సహాయపడతాయి. మెంతుల్లో ఉండే నికోటినిక్ ఆమ్లం చుండ్రు, జుట్టు రాలడానికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాదు ఎన్నో రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. 

మెంతుల్లో విటమిన్ వి, విటమిన్ సి, విటమిన్ కె, ఫ్లేవనాయిడ్లు, ఫోలిక్ యాసిడ్, సపోనిన్లు కూడా ఉంటాయి. ఇవి యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. పొడి జుట్టు, బట్టతల, జుట్టు సన్నబడటం, వంటి నెత్తిమీద ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. 
 

click me!