ఇనుము
ఇనుము మెదడుకు కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. అభిజ్ఞా అభివృద్ధి, DNA సంశ్లేషణ, మైటోకాన్డ్రియల్ శ్వాసక్రియ, మైలిన్ సంశ్లేషణ, న్యూరోట్రాన్స్మిటర్ సంశ్లేషణ, జీవక్రియ వంటి మెదడు పనితీరులో ఇది సహాయపడుతుంది. అందుకే ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను పుష్కలంగా తినండి. పాలకూర, చిక్కుళ్లు, గుమ్మడి గింజలు, గుడ్లు, డార్క్ చాక్లెట్స్, ఎండుద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పప్పు ధాన్యాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.