చెమట పడితే కూడా జుట్టు రాలిపోతుందా?

Published : Aug 28, 2022, 02:52 PM IST

జుట్టు రాలడానికి చెమట కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. తలకు ఎక్కువ చెమట పట్టడం వల్ల హెయిర్ ఫాల్ దారుణంగా పెరుగుతుంది. మరి ఈ సమస్యను  తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 

PREV
17
 చెమట పడితే కూడా జుట్టు రాలిపోతుందా?

కొంతమందికి ఏడాదిపొడవునా వెంట్రుకలు ఊడిపోతూనే ఉంటాయి. ముఖ్యంగా షాంపూతో తలస్నానం చేసినప్పుడు, దువ్వినప్పుడు వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతుంటాయి. ఇలాంటి వారికి నెత్తికి స్నానం చేయాలన్నా.. దువ్వాలన్నా భయంగానే ఉంటుంది. ఇక హెయిర్ ఫాల్ ను ఆపాలని రకరకాల షాంపూలను మారుస్తూ ఉంటారు. వీటివల్ల జుట్టు మరింత ఎక్కువ ఊడిపోతుంది. మీకు తెలుసా.. జుట్టు ఊడిపోవడానికి చెమట కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. 
 

27

భద్రపద మాసంలో  ఎండలు ఎక్కువగా కొడతాయి. మండుతున్న ఎండలకు విపరీతంగా చెమట పట్టడం చాలా కామన్. కానీ తలకు చెమట పడితే మీ జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీకు కూడా  నెత్తిపై చెమట ఎక్కువగా పట్టి జుట్టు రాలిపోతుంటే వెంటనే ఈ చిట్కాలను ఫాలో అయిపోండి. 
 

37

ఎక్కువగా చెమట పట్టే వారు ఒక నియమం ప్రకారం నెత్తికి షాంపూను అప్లై చేయొచ్చు. అంటే ఇలాంటి వారు తక్కువ ఘాడత ఉన్న షాంపూలను పెట్టొచ్చు. దీనివల్ల మాడుపై పేరుకుపోయిన మురికి, నూనెను బయటకు పోతాయి. హెయిర్ ఫాస్ సమస్య కూడా పోతుంది. చెమట విపరీతంగా పట్టి .. దారుణంగా జుట్టు రాలిపోతుంటే ఈ పద్దతిని పాటించండి. 

47

జుట్టుకు ఆవిరి పట్టడం ద్వారా కూడా హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడగలుగుతారు. మీ జుట్టును క్రమం తప్పకుండా ఆవిరి పట్టడం ద్వారా మాడుపై ఉన్నమురికి, టాక్సిన్స్ బయటకు పోతాయి.  హెయిర్ ఫోలికల్స్ యాక్టివేట్ అవుతాయి కూడా. ఈ ఆవిరి చెమట పట్టడం వల్ల జుట్టు రాలడం అనే సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. 
 

57

ఆయిల్ మసాజ్ చేయడం వల్ల ఈ సమస్య  నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.  మాడుకు నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేస్తూ ఉండాలి. దీని వల్ల హెయిర్ ఫోలికల్స్ సరిగ్గా ఉండి రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. 

67

నెత్తిమీద ఎక్కువగా చెమట పట్టే వారు జుట్టును బిగుతుగా వేసుకోకూడదు. ముఖ్యంగా పోనీటైల్ వేసుకోకపోవడమే ఉత్తమం. ఈ సమస్య ఉన్న వారు వీలైనంత వరకు నెత్తికి ఆవిరిని పట్టండి. ఈ ఇది సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. జుట్టు డ్యామేజ్ అవడం కూడా ఆగిపోతుంది. 

77

మీ జుట్టును క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోండి. ఇది నెత్తిపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చెమట పట్టడాన్ని తగ్గించి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకలు పెరిగే కొద్దీ వెంట్రుకల కుదుళ్లు సరిగ్గా ఉంటాయి. కాబట్టి జుట్టును అందంగా ఉంచడానికి క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం అవసరం. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories