బట్టతల రాకూడంటే.. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

First Published Sep 20, 2022, 3:51 PM IST

జుట్టు రాలకుండా ఉండాలంటే మీరు పెద్దగా కష్టపడిపోవక్కర్లే.. కొన్ని చిన్ని చిన్న  పనులను చేస్తే చాలు. వీటివల్ల జుట్టు రాలడం ఆగిపోయి.. మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది కూడా. 
 

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడం ఆగిపోవాలని, నెలకో షాంపూను, నూనెను మార్చే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి మీరు షాంపూను, నూనెను మార్చినంత మాత్రాన జుట్టు రాలడం ఆగిపోదు. ఎందుకంటే జుట్టుకు కావాల్సింది లోపలి నుంచి పోషణ. అప్పుడే మీ జుట్టు రాలడం ఆగుతుంది. అప్పటి దాకా ఆగదు. మన శరీరంలో పోషకాల లోటు ఏర్పడితే కూడా జుట్టు రాలడం మొదలవుతుంది. రోజూ వంద వెంట్రుకలు ఊడిపోవడం సాధారణమే. ఇంతకంటే ఎక్కువ ఊడిపోతే మాత్రం కాస్త జాగ్రత్త వహించాల్సిందే. ఇంతకు హెయిర్ ఫాల్ ను ఎలా ఆపాలో తెలుసుకుందాం పదండి. 
 

రసాయనాల ఎఫెక్ట్ ను, కాలుష్య ప్రభావాలను మీరు నివారించలేరు. కానీ మీ శరీరంలో పోషకాల లోపం లేకుండా మాత్రం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్లే జుట్టును బలోపేతం చేస్తాయి. దీంతో మీ జుట్టు రాలడం ఆగిపోతుంది. అలాగే కొత్త జుట్టు రావడం కూడా మొదలవుతుంది. ఇందుకోసం మీ ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. 

protein

ప్రోటీన్ ఫుడ్

ప్రోటీన్ ఫుడ్ మన శరీరానికే కాదు.. జుట్టుకు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఎవరి శరీరంలో అయితే ప్రోటీన్ లోపిస్తుందో.. వారి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. జట్టు ఊడిపోవడం ఆగిపోవాలన్నా.. బట్టతల రాకూడదన్నా ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తినాలి. గుడ్లు, చేపలు, పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పాలల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రోటీన్ లోపం వల్ల ఊడిపోయిన జుట్టును మళ్లీ మొలిపించడానికి ఇది సహాయపడుతుంది. 
 

విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారం

జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు విటమిన్ ఇ కూడా ఉపయోగపడుతుంది. అందులో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్లు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. బాదం పప్పులను తింటే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు, ఊడిపోకుండా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అందుకే ఈ విటమిన్ ఉండే ఆహారాలను ఎక్కువగా తినండి. 

calcium

కాల్షియం లోపం

కాల్షియం ఎముకలను బలంగా ఉంచడమే కాదు.. జుట్టును బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ శరీరంలో కాల్షియం లోపించడం వల్ల ఎముకలు బలహీనంగా మారడమే కాదు.. జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతుంది. అలాగే వెంట్రుకలు మధ్యలో తెగిపోతాయి కూడా. జుట్టు రాలుతుంటే.. పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులను తీసుకోండి. వీటిలో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. మీ శరీరంలో కాల్షియం లోపం తొలగిపోతే జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. 
 

ఇవి కూడా..

ఫుడ్ తో పాటుగా.. ఆరోగ్యవంతమైన జుట్టుకోసం జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే రోజూ కాసేపు నెత్తిని మసాజ్ చేయాలి. అప్పుడే నెత్తికి రక్తప్రసరణ మెరుగ్గా జరిగి కుదుళ్లు బలపడతాయి. అలాగే జుట్టును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. రోజుల తరబడి జుట్టును శుభ్రం చేయకపోతే జుట్టుపై మురికి పేరుకుపోతుంది. దీంతో డాండ్రఫ్ రావడంతో పాటుగా జుట్టు కూడా విపరీతంగా ఊడిపోతుంది. అయితే కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను కూడా వాడకూదు. ఇవి కూడా జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి. 

click me!