ఈ అలవాట్లే అందాల తార రేఖను.. 67యేళ్ల వయసులోనూ నిత్యయవ్వనంగా ఉంచుతున్నాయి.. అవేంటంటే..

First Published | Sep 20, 2022, 1:22 PM IST

రేఖ.. అందానికి మారుపేరు.. అభినయానికి చిరునామా... పాతతరం నటి అయినా.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో.. అంతే ఆకర్షణతో ఆకట్టుకుంటోంది. 67యేళ్ల వయసులోనే అంత అందంగా ఉండడానికి ఆమె అమృతం తాగుతుందా? చూడండి మరి... 

రేఖ అంటే గోల్డెన్ గర్ల్.. ఎన్నో లక్షలమంది అభిమానుల హృదయరాణి...ఆమె అందం కాలంతో పాటు చెరగలేదు. ఇప్పటికే అదే అందం ఆమె సొంతం. రేఖ అసలు పేరు భానురేఖ గణేశన్. ఆమె తన క్రమబద్ధమైన జివనవిధానం, ఆహారపుటలవాట్లు, వ్యామాయాలతో వయసును జయించింది. అందుకే 67యేళ్ల వయసులోనూ స్టన్నింగ్ బ్యూటీలా ఉంది.

ఈ వయసులోనూ ఆమె ఆరోగ్యకరమైనచర్మం ఎంతో మందికి స్పూర్తినిస్తుంది. దీనికి కారణమేంటో తెలుసా? ఆమె ఎప్పుడూ తన శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకుంటుంది. రోజు మొత్తం చాలా నీరు తాగుతుంది. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ బైటికి పోవడానికి తోడ్పడుతుంది. 


తక్కువ ఆహారం...
అన్నిరకాల పోషకాలతో ఉండే సింపుల్ డైట్ ను రేఖ ప్రిఫర్ చేస్తుంది. ప్రతీరోజు ఆమె డైట్ లో సలాడ్స, కూరగాయలు, చపాతి, అన్నం.. ఒక పప్పు ఉంటాయి.

ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు నో...
రేఖ వేపుళ్లు లాంటి నూనె పదార్థాలకు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటుంది. దీనివల్లే చక్కటి ఆకారం ఆమె సొంతం. సాధారణమైన, ఆరోగ్యకరమైన ఈ డైట్ ప్లాన్ ఆమెను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. వయసును కనిపించనివ్వదు. 

రాత్రిపూట చాలా తొందరగా డిన్నర్ ముగిస్తుంది. 7.30కల్లా ఆమె డిన్నర్ పూర్తవుతుంది. పడుకోవడానికి .. డిన్నర్ కు మధ్య 2,3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంటుంది.

ఆమె రోజువారీ ఆహారంలో పెరుగు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటారు. మెయిన్ కోర్సును పెరుగుతో ముగించడం ఆమెకు చాలా ఇష్టం.

స్నాక్స్ విషయానికి వస్తే.. జంక్ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లదు. వాల్ నట్స్, దానిమ్మ గింజల్ని తింటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. 

Image: Jill Willington

శాఖాహారి...
రేఖ.. హార్డ్ కోర్ శాఖాహారి. నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్లరు. అంతేకాదు శాఖాహారంలోనూ అతి సామాన్యమైన, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తారు. 

రెగ్యులర్ వర్కవుట్స్...
రేఖ.. యోగా చేస్తారు. సింపుల్ హోం వర్కవుట్స్ చేస్తారు. రోజూ 10-15 ని.లపాటు వ్యాయామం తప్పనిసరిగా చేస్తారు. వీటితో పాటు గార్డెనింగ్ చేయడం ఆమెకు చాలా ఇష్టం. ఇంటిపనులు, డ్యాన్స్ తనను ఉత్సాహంగా ఉంచుతాయని నమ్ముతుంది. 

మొత్తానికి ఆమె ఆరోగ్య రహస్యం ఏమిటంటే.. సరైన ఆహారాన్ని, సరైన సమయంలో తీసుకోవడం.. అదే ఆమెను ఇంకా యవ్వనంగా ఉంచుతోంది. 

Latest Videos

click me!