వర్షంలో తడిసిన వెంటనే తలస్నానం
వర్షాకాలంలో జుట్టు తడవడం చాలా సహజం. ఎందుకంటే ఈ సీజన్ లో ఎప్పుడైనా, ఎక్కడైనా వర్షం కురిసే అవకాశం ఉంది. అందుకే మీరు బయటకు వెళ్లే ముందు గొడుగును తప్పకుండా తీసుకెళ్లండి. కానీ కొన్నిసార్లు జుట్టు తడిసే అవకాశం ఉండొచ్చు. అయితే జుట్టు తడిస్తే వెంటనే మీ జుట్టును తేలికపాటి షాంపూతో బాగా కడగండి. ఇలా చేయకపోవడం వల్ల నెత్తిమీద జిడ్డు, దురద, చుండ్రుతో పాటు జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది.