జుట్టు బాగా రాలిపోతోందా? మీరు ఎంచుకున్న షాంపూ సరైనదేనా.. చెక్ చేయండి..

First Published Aug 11, 2021, 12:08 PM IST

ఇటీవలి కాలంలో జుట్టు రాలే సమస్య ప్రతీ ఒక్కరూ ఎదుర్కుంటున్నదే. జుట్టు పలచబడి పోతుంది అని ఎవరైనా అన్నారంటే.. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. దీనికి మానసిక ఒత్తిడితో సహా.. అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు వాడే రకరకాల షాంపూలు కూడా హెయిర్ ఫాల్ కి దోహదం చేస్తాయి. 

నిగనిగలాడే, ఒత్తైన జుటు ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా మెరుస్తూ, పట్టుకుచ్చుల్లాగా సిల్కీగా ఉండే జుట్టు మనిషి అందాన్ని మరింత పెంచుతుంది. అయితే తరచుగా జుట్టు రాలిపోవడం.. పెద్ద సమస్యగా మారుతుంది.
undefined

పూర్వకాలంలో కుంకుడుకాయ, షికాయలతో తలస్నానం చేసేవారు... నేటి బిజీ జీవితంలో అంత సమయం వెచ్చించలేక ఈజీగా దొరికే షాంపూలనే ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిలో సరైన షాంపూలు ఎంచుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది.
undefined
సాష్ ప్రొడక్ట్స్ చేసిన సర్వే లో 10,000 మంది హెయిర్ ఫాల్ బాదితులు తాము హెయిర్ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు తప్పులు చేసినట్లు అంగీకరించారు. మరి షాంపూలను ఎలా ఎంచుకోవాలి? ఎలాంటి షాంపూలు జుట్టుకు మంచివి? అనేది తెలుసుకుంటే ఈ సమస్యనుంచి బయటపడొచ్చు.
undefined
అనియోనిక్ సల్ఫేట్లు కలిగిన షాంపూలు అంటే, సోడియం లౌరిల్ సల్ఫేట్ (SLS), అమ్మోనియం లౌరిల్ సల్ఫేట్ (ALS) లతో కూడిన షాంపూలు జుట్టు ఉపరితలంపై ప్రతికూలప్రభావాన్ని చూపిస్తాయి. ఇది జుట్టును బిరుసుగా చేస్తుంది. ఇవి చాలా బలమైన క్లెన్సర్లుగా పనిచేసి, హెయిర్ క్యూటికల్ పొరను దెబ్బతీస్తుంది. దీంతో జుట్టు పొడిబారి పోతుంది. తెగిపోతుంది.
undefined
హెర్బల్ షాంపూలు మంచివే కానీ.. అనేక మూలికలతో కూడిన హెర్బల్ షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు పీహెచ్ దెబ్బతింటుంది. హెర్బల్ షాంపూల్లో ఉపయోగించే మూలికల్లో H+ అయాన్లతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి తలలోని pHని అసమతుల్యపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. తలమీద ఉండాల్సిన.. PH 4.5-5.5 మద్యలో ఉండాలి. అందుకే ఎక్కువ మూలికలతో తయారు చేసిన హెర్బల్ షాంపూలకంటే తక్కువ మూలికలతో తయారైనవే జుట్టుకు మంచివి.
undefined
అబ్రాసివ్-లాడెన్ కలిగిన షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. షాంపూల్లోని ీ అబ్రాసివ్‌లు జుట్టు నుండి జిడ్డును తొలగించే పురాతన కాలపు పద్దతే.. అయితే వీటివల్ల జుట్టు క్యూటికల్ క్షీణిస్తుంది.. జుట్టు సరైన పోషణను పొందకుండా ఉండడానికి.. పోషకాలను శోషించుకోకుండా ఉండేలా చేస్తుంది.
undefined
షాంపూ చేసుకునేటప్పుడు చేసే అత్యంత సాధారణంగా చేసే తప్పు ఏంటంటే.. జుట్టును గట్టిగా రుద్దడం, శుభ్రమైన బట్టతో కాకుండా తల తూడుచుకోవడం.. జుట్టు తడిగా ఉన్నప్పుడే బలం ఉపయోగించి టవల్ తో బలంగా దులపడం వల్ల కూడా జుట్టు బాగా ఊడిపోతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు.. సున్నితంగా ఉంటుంది.. పొడి జుట్టుకంటే 5 రెట్టు ఎక్కువ పెళుసుగా ఉంటుంది. కాబట్టి షాంపూ చేసేప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి.
undefined
మీ జుట్టు ఏరకమైనదో తెలుసుకోకుండా.. షాంపూ ఎంచుకోవడం వల్ల కూడా జుట్టు సమస్య పెరిగిపోతోంది. మీ జుట్టు రకాన్ని బట్టి.. షాంపూలో ఉన్న గ్లిజరిన్, ఆయిల్, సిలికాన్, కెరాటిన్ కంటెంట్‌ని తనిఖీ చేయండి. పై అన్ని పదార్ధాలు కర్లీ హెయిర్, కాయిల్డ్ హెయిర్ కోసం ఎక్కువగా ఉండాలి, స్ట్రెయిట్ హెయిర్ కోసం వీటి శాతం తక్కువగా ఉండాలి. స్ట్రెయిట్ హెయిర్ కోసం పైన పేర్కొన్న పదార్థాలు షాంపూలో ఎక్కువగా ఉంటే జుట్టు మరింత జిడ్డుగా తయారవుతుంది. పోషకాలు జుట్టులోకి చొచ్చుకుపోకుండా ఉంటాయి.

click me!