పెళ్లి తర్వాత కూడా చాలా మంది లైంగిక అసంతృప్తితో అవస్థలు పడుతూ ఉంటారు. అసలు ఈ లైంగిక నిరాశ, అసంతృప్తి ఎప్పుడు కలుగుతాయో తెలుసా..? ఇష్టం లేని వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందినప్పుడు చాలా మందిలో ఈ లైంగిక నిరాశ మొదలౌతుందట.
undefined
లేదంటే.. మానసికంగా నిరాశకు గురైనప్పుడు.. శరీరంలో ఉద్రేకంగా తగ్గినప్పుడు.. శారీరక అసౌకర్యం కలిగినప్పుడు.. లిబిడో తగ్గినప్పుడు ఇలా కారణం ఏదైనా ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. ఉందని నిపుణులు చెబుతున్నారు.
undefined
లైంగిక నిరాశను కొన్ని విధాలుగా తొలగించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
undefined
వాస్తవానికి లైంగిక సంబంధం ఆనందంగా సాగకపోవడానికి.. మనసు కూడా ఒక కారణం. మానసికంగా ఓ వ్యక్తితో దగ్గరకాలేకపోతే.. అలాంటి వారితో.. కలయిక ఎక్కువ కాలం ఆనందాన్ని ఇవ్వదు. బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే భుజం వెన్నంటే ఉంటే.. మానసిక ఆనందం కలుగుతుంది. అలాంటివారితో మాత్రమే కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి. ముందుగా ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకోవం చాలా ముఖ్యం.
undefined
అలా కాకుండా.. మీరు ప్రేమించిన వ్యక్తి తో కూడా లైంగిక ఆనందాన్ని పొందలేకపోతున్నాము అంటే.. మీ శరీరంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాయామంపై దృష్టిపెడితే.. లైంగిక అసంతృప్తిని పొగొట్టవచ్చట. కాబట్టి వ్యాయామంపై దృష్టి పెట్టాలి.
undefined
ఇక సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతున్నామనే బాధను, ఉక్రోశాన్ని చాలా మంది తమ పార్ట్ నర్ పై చూపిస్తారు. కాబట్టి.. ముందు అది మానుకోవాలి. మీ సమస్యను.. వాళ్ల సమస్యగా మార్చకూడదు. కాబట్టి .. వారిని ఎత్తి చూపడం ఆపి.. సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలి.
undefined
ఇక సెక్స్ ఎప్పుడూ పురుషులే ప్రారంభించాలనే రూల్ ఎక్కడా లేదు. ఒక వేళ మీ భర్త ప్రారంభించకుంటే.. మీరే లీడ్ తీసుకోవాలి. అప్పుడు.. వారిలో ఉన్న సెక్స్ అసంతృప్తి కాస్తతగ్గే అవకాశం ఉంటుంది.
undefined
కేవలం పడకగదిలో మాత్రమే కాకుండా.. ఇతర సమయాల్లోనూ ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇద్దరి మధ్య బాండింగ్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరి మధ్య సఖ్యత పెరిగితే.. ప్రేమ పెరిగి.. కలయికను ఆస్వాదించే అవకాశం ఉంటుంది.
undefined
ఎన్ని చేసినా మార్పు రావడం లేదంటే.. సంబంధిత నిపుణులతో ఒకసారి మాట్లాడాలి. వారు దీనికి పరిష్కారం చెబుతారు.
sex life