Green tea Side effects: గ్రీన్ టీ మంచిదే కానీ కొందరిలో ఈ సైడ్ ఎఫెక్టులు కనిపించవచ్చు

Published : Dec 25, 2025, 07:23 PM IST

Green tea Side effects: గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి  మంచిదే. కానీ  కొంతమందిలో మాత్రం అది కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు చూపిస్తుంది. గ్రీన్ టీ తాగేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు.  

PREV
15
గ్రీన్ టీ ఎందుకు మంచిది?

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో సహజంగా పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటాయి. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగే అలవాటు చేసుకుంటే శరీరానికి అనేక విధాల లాభాలు కలుగుతాయి. మొదటిగా గ్రీన్ టీ లో క్యాటెచిన్స్ ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు చాలా నెమ్మదిగా కనపిస్తాయి. అయితే గ్రీన్ టీ అధికంగా తాగడం మాత్రం మంచిది కాదు. కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది. గ్రీన్ టీ తాగేటప్పుడు కొన్ని తప్పులు కూడా చేయకూడదు.

25
మరీ వేడిగా తాగకూడదు

గ్రీన్ టీని తాగడం మంచిదే కాదు మరీ వేడిగా తాగకూడదు. అలా తాగితే యాసిడ్ ఉత్పత్తి పెరిగి కడుపులో మంట, ఉబ్బరం, నొప్పి వస్తాయి. మరీ వేడిగా తాగితే గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్ల ప్రయోజనాలు శరీరానికి అందవు. కాబట్టి గ్రీన్ టీ గోరువెచ్చగా మారాక తాగడం మంచిది.

35
ఖాళీ పొట్టతో...

చాలా మంది ఉదయాన్నే ఖాళీ పొట్టతో, పరగడుపున గ్రీన్ టీ తాగుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనిలోని కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది నేరుగా పొట్టలో చేరి యాసిడ్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి పరగడుపున గ్రీన్ టీ తాగడం ఏమాత్రం మంచిది కాదు.

45
ఎన్ని కప్పులు తాగాలి?

సాధారణంగా రోజులో 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. ఈ పరిమితికి మించి తీసుకుంటే శరీరానికి హాని కలగవచ్చు. ఒక కప్పు గ్రీన్ టీ లో కేఫిన్ మోతాదు తక్కువగానే ఉంటుంది. అయినా ఎక్కువగా తీసుకుంటే ఆమ్లత్వం, కడుపు మంట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల పరిమితంగా తాగడం మంచిది. భోజనం చేసిన వెంటనే కాకుండా కొంత గ్యాప్ ఇచ్చి తాగడం ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. రాత్రి నిద్రకు ముందు తాగకుండా ఉండటం మంచిది. గర్భిణీలు, కడుపు సమస్యలు ఉన్నవారు, రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి. ప్రతి వ్యక్తి శరీర పరిస్థితిని బట్టి పరిమాణం మారవచ్చు.

55
చక్కెర కలపకండి

గ్రీన్ టీలో చక్కెర కలపకూడదు. గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు చక్కెర వల్ల తగ్గిపోతాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. చక్కెర కలిపితే అదనపు క్యాలరీలు శరీరంలో చేరతాయి. బరువు తగ్గాలనే ఉద్దేశంతో గ్రీన్ టీ తాగుతున్న వారికి ఇది ప్రతికూలంగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగే అవకాశం కూడా ఉంటుంది. చక్కెర కలపకుండా తాగడం అలవాటు లేకపోతే, మొదట్లో కొద్దిగా తేనె కలపవచ్చు. అయితే అది కూడా పరిమితంగా ఉండాలి. క్రమంగా తీపి లేకుండా తాగే అలవాటు పెంచుకుంటే గ్రీన్ టీ సహజ రుచి నచ్చడం మొదలవుతుంది. ఇంకొక మార్గం ఏమిటంటే నిమ్మరసం కొద్దిగా కలపడం. ఇది రుచిని మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల శోషణకూ సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories