Clothes Stains: దుస్తులపై కొన్ని మరకలు పెడితే జిడ్డులా పెట్టేస్తాయి. కొన్ని చిట్కాల ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. ఖరీదైన డిటర్జెంట్లు వాడినా కూడా మరకలు పూర్తిగా పోవు. దుస్తులపై మొండి మరకలను తొలగించాలంటే ఈ ఇంటి చిట్కాలను ప్రయత్నించండి..
ఆహారం తింటున్నప్పుడు కూరలు వంటివి దుస్తులపై పడుతూ ఉంటాయి. ఆ నూనె మరకలు లేదా కాఫీ, టీ మరకలు పడితే మామూలు డిటర్జెంట్ లేదా సబ్బుతో తొలగించడం కొంచెం కష్టమే. ఇప్పుడు మార్కెట్లో బట్టల మరకలు పొగొట్టడం కోసమే కొన్ని లిక్విడ్స్ వచ్చాయి. వాటిలో కొన్ని మంచి ఫలితాలు ఇచ్చినా, మరికొన్నింటిని కొనేందుకు ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉంటుంది. అయినా సరే మరకలు సరిగా పోవు. ఏ మరక పోవడానికి ఏ ఇంటి చిట్కా పనిచేస్తుందో వాటిని సులభంగా ఎలా తొలగించాలో తెలుసుకోండి.
26
టీ లేదా కాఫీ మరకలకు
తెల్లటి షర్టుపై టీ లేదా కాఫీ మరకలు పోతే వాటిని తొలగించడం చాలా కష్టం. మీరు ఇంట్లో ఉంటే, మరక పడిన చోట వెంటనే చల్లటి నీళ్లు పోయండి. తర్వాత వంటసోడా చల్లి నెమ్మదిగా రుద్దండి. 15-20 నిమిషాల తర్వాత ఉతకండి. పాత మరకలైతే వెనిగర్, నీళ్ల మిశ్రమాన్ని వాడండి. ఇలా చేస్తే ఆ మరకలు త్వరగా పోతాయి.
36
నూనె లేదా గ్రీజు మరకలు
నూనె లేదా గ్రీజు మరకలు పడితే ఒకంతట పోవు. ఆ మరకను తొలగించడానికి వెంటనే టాల్కమ్ పౌడర్ లేదా కార్న్‌ఫ్లోర్‌ను ఆ మరకపై చల్లండి. ఇది నూనెను వెంటనే పీల్చేసుకుంటుంది. ఆ తరువాత పది నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. తర్వాత లిక్విడ్ డిష్ సోప్ అప్లై చేసి ఉతకండి. నూనె మరకల కోసం కొన్ని ప్రత్యేక డిష్ సోప్‌లు ఉంటాయి.
తెల్ల చొక్కాల కాలర్ లేదా చేతులపై పసుపు మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. చెమట వల్ల కూడా ఇవి పడతాయి. వాటిని తొలగించడానికి నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి మరకపై చల్లి రుద్దండి. అరగంట ఎండలో ఉంచి, తర్వాత మామూలుగా ఉతకండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. దీని వల్ల మరకలు సులువుగా పోతాయి.
56
ఇంక్ మరకలు
పెన్ ఇంక్ మరకలు చదువుకునే పిల్లల యూనిఫామ్ లపై పడడం సహజమే. మరక పడిన ప్రదేశం కింద టిష్యూ పేపర్ ఉంచి, దానిపై హ్యాండ్ శానిటైజర్ లేదా ఆల్కహాల్ వేసి రుద్దండి. ఇంక్ వ్యాపిస్తుంది. అప్పుడు దానిని కాటన్ స్వాబ్‌తో తుడవండి. తర్వాత డిటర్జెంట్‌తో ఉతకండి. తెల్లటి టూత్‌పేస్ట్ పూసి రుద్దడం కూడా ప్రయోజనకరం.
66
కూరవల్ల పసుపు మరకలు
కూర బట్టలపై పడినప్పుడు పసుపు మరకలను చాలా మొండిగా అతుక్కుపోతాయి. ఈ మరకపై చల్లని పాలు పోయండి లేదా డిటర్జెంట్‌తో చిక్కటి పేస్ట్ చేసి అప్లై చేయండి. ఉతికిన తర్వాత, బట్టలను ప్రకాశవంతమైన సూర్యకాంతిలో ఆరబెట్టండి. పసుపు రంగును తొలగించడంలో సూర్యరశ్మి అద్భుతంగా పనిచేస్తుంది.