Goa Tour: సమ్మర్ హాలీడేస్ వచ్చేశాయి. చాలా మంది టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్‌లో గోవా కూడా ఒకటి. సమ్మర్‌లో గోవా ట్రిప్ చేయడంలో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువగా ఎంజాయ్ చేయాలంటే ఇదే సరైన సమయం.
వేసవిలో గోవా ట్రిప్ చేయాలంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఫ్లైట్ టికెట్లు, హోటల్స్, టూర్స్ అన్నీ డిస్కౌంట్‌లో లభిస్తాయి. అదే బడ్జెట్‌లో మీరు ఎక్కువ రోజులు స్టే చేయగలుగుతారు. మిగిలిన డబ్బుతో ఫుడ్, డ్రింక్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా ఎక్కువగా ఆస్వాదించవచ్చు.
25
షాపింగ్‌కు బెస్ట్ టైమ్
సమ్మర్‌లో గోవా మార్కెట్లు చాలా చౌకగా ఉంటాయి. మంచి డిజైన్ ఉన్న డ్రెస్సులు, బీచ్‌వేర్, యాక్సెసరీస్ తక్కువ ధరలకు దొరుకుతాయి. ఎక్కువగా బేరమాడాల్సిన అవసరం ఉండదు. ట్రిప్‌లో సేవ్ అయిన డబ్బుతో షాపింగ్‌ను మరింతగా ఎంజాయ్ చేయవచ్చు.
35
తక్కువ జనాలు
ఎండల కారణంగా వేసవిలో టూరిస్టులు ఎక్కువగా గోవాకు రారు. కాబట్టి ఈ సమయంలో గోవా బీచ్‌లు చాలా ప్రశాంతంగా ఉంటాయి. గుంపులు తక్కువగా ఉండటం వల్ల మీరు స్వేచ్ఛగా తిరగవచ్చు. ఫోటోలు తీయడం, బీచ్‌లో టైమ్ గడపడం మరింత సులభంగా ఉంటుంది. అలాగే వాటర్ స్పోర్ట్స్ కూడా తక్కువ రేట్లకు లభిస్తాయి.
పారా సెయిలింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్‌ను సమ్మర్‌లో ట్రై చేయడం మంచి అనుభవం. సముద్రం, బీచ్‌ల అందాలు ఎత్తు నుంచి చూడటం ఒక ప్రత్యేక అనుభూతి. ఈ సీజన్‌లో ఈ యాక్టివిటీస్ ధరలు కూడా తగ్గుతాయి.
55
ఫోటోగ్రఫీకి గోల్డెన్ ఛాన్స్
సమ్మర్‌లో బీచ్‌లు, ఫోర్ట్స్, చర్చిల్లో జనాల రష్ కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు మీకు నచ్చినట్టు ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఫోటోలు తీసుకుని గుర్తుగా ఉంచుకోవచ్చు. మొత్తం మీద వేసవిలో గోవా వెళ్లడం మంచి అవకాశం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది.