పిల్లల కోసం ప్రతి ఏడాది బాలల దినోత్సవం వస్తుంది. నెహ్రూగారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. నెహ్రూ గారు పిల్లలే దేశ భవిష్యత్తు అని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ పిల్లలు చదువులో ముందుండాలి, సత్యం, ప్రేమ, శాంతి వంటి విలువలను నేర్చుకోవాలని కోరుకునేవారు. ప్రతి పిల్లవాడు సంతోషంగా జీవించాలి, మంచి విద్య పొందాలి, దేశానికి మేలుచేయాలన్నది ఆయన కల. ఈ రోజు మనం ఆయన ఆశయాలను గుర్తు చేసుకొని, బాగా చదవాలి, మంచి పనులు చేయాలి, మన గురువులను గౌరవించాలి.
మన తల్లిదండ్రులకు ప్రేమ చూపాలి, మన దేశాన్ని గర్వపడేలా చేయాలి. బాలల దినోత్సవం మనకు ఒక అందమైన సందేశం ఇస్తుంది ... పిల్లలు పూలవంటివారు, వాళ్లు నవ్వితే ప్రపంచం అందంగా మారుతుంది.
అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే!
జై హింద్