ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. మోకాళ్ల నొప్పులకు (Knee pain) ముఖ్యకారణం అధిక బరువుతో పాటు జీవనశైలిలోని (Lifestyle) మార్పులు కావచ్చు. దీనికి తోడు చెడు ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణం. అందులోనూ ఈ మోకాళ్ళ నొప్పులు వృద్ధాప్య సమయంలోనే కాక యుక్తవయసు వారిని కూడా బాధిస్తున్నాయి. స్థూలకాయంతో శరీర బరువు మొత్తం మోకాళ్లపై పడడంతో మోకాళ్ళ నొప్పులు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే అనేక కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి.
ఇక ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నోచర్యలను తీసుకుంటూ ఉంటారు. అయినా ఈ నొప్పులు తగ్గనివారు చాలా మందే ఉన్నారు. అయితే ఇలాంటి వ్యక్తులకు కొన్ని రకాల నూనెలు బాగా ఉపయోగపడుతాయి. ఇందులో అల్లం నూనె ఒకటి. అల్లం నూనెతో మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అల్లంలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. అల్లమే కాదు.. అల్లం నూనె కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగానే ఉంటుంది. ఈ నూనె కీళ్ల నొప్పులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎలా నయం చేస్తుందో.. దాన్ని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ginger teA
అల్లం ఎలా ఉపయోగించాలి.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం ముందుంటుంది. నొప్పులకు ఈ నూనెను అప్లై చేసి కాసేపు మసాజ్ చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదీ కాకుండా అల్లంను టీలో కూడా వేసుకుని తాగొచ్చు. లేదంటే అల్లం నీటిని కూడా తాగవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తవానికి అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కీళ్ల నొప్పుల నుంచి బయటపడతారు.
అల్లం నూనె ఎలా తయారు చేయాలి.. అల్లం నూనె తయారు చేయాలంటే ముందుగా అల్లం వెల్లుల్లిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లంలో ఒక చెంచా ఆలివ్ నూనె కలపాలి. తరువాత ఈ పేస్ట్ ని బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత పేస్ట్ ని చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేయాలి.
అల్లం నూనె ఎలా తయారు చేయాలి.. అల్లం నూనె తయారు చేయాలంటే ముందుగా అల్లం వెల్లుల్లిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లంలో ఒక చెంచా ఆలివ్ నూనె కలపాలి. తరువాత ఈ పేస్ట్ ని బాగా ఉడకబెట్టాలి. ఆ తర్వాత పేస్ట్ ని చల్లార్చి ఒక డబ్బాలో స్టోర్ చేయాలి.