Male Fertility: వేడి గాలుల వల్ల వీర్య కణాలు దెబ్బతింటాయా..!

First Published | May 29, 2022, 4:18 PM IST

Male Fertility: పురుషుల్లో సంతానోత్పత్తి (Fertility) బలహీనంగా ఉండటానికి ఎన్నో కారణాలున్నాయి. అవేంటంటే..

పెళ్లైన ప్రతి భార్యా భర్త కోరుకునే మొదటి కోరిక తాము తల్లిదండ్రులు కావాలని. కానీ కొంతమంది ఏండ్లు గడిచిన తల్లిదండ్రులు మాత్రం కాలేకపోతుంటారు. పిల్లలు పుట్టకపోవడానికి భార్య లేదా భర్తలో ఏవైనా లోపాలు ఉండొచ్చు. కానీ చాలా మటుకు మన దేశంలో పిల్లలు పుట్టకపోతే అమ్మాయిలకే లోపం ఉందని ఎత్తి చూపుతారు. ఒకవేళ  అబ్బాయికి లోపం ఉన్నా పెద్దగా బయటపెట్టరు. వారిని నిందించరు. 

ఈ సంగతి పక్కన పెడితే ప్రస్తుత కాలంలో వివాహిత పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తడానికి కారణాలు చాలానే ఉన్నాయి. గజిబిజీ లైఫ్ స్టైల్, ఆహారం వంటివి కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. అందులోనూ పెళ్లైన తర్వాత అబ్బాయిలపై బాధ్యత  చాలా పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను మోసే క్రమంలో వీరు తమ ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోరు. దీనివల్ల వారి వీర్యకణాల (Sperm) సంఖ్య, వీటిన నాణ్యత , టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. వీటితో పాటుగా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 

వాతావరణంలో మార్పు.. ఒక నిర్ధిష్ట కారణం వల్ల కూడా పురుషుల సంతానోత్పత్తిని తగ్గించవచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఇది వాతావరణ మార్పుల వల్ల కూడా సాధ్యమవుతుందని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో వేగంగా మారుతున్న వాతావరణ మార్పు సంతానోత్పత్తిపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. 

యూకేలోని యూనివర్సిటీ ఆప్ ఈస్ట్ ఆంగ్లియాలో నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం.. వేడి గాలులు కూడా స్పెర్మ్ ను నాశనం చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన నివేదిక నేచర్ కమ్యూనికేషన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది.

వేడి గాలులు వీర్యకణాలపై ప్రభావం చూపుతుంది.. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన మాట్ గేజ్ మాట్లాడుతూ.. వాతావారణం చాలా వేడిగా ఉన్నప్పుడు స్మెర్మ్ ప్రక్రియ సున్నితంగా ఉంటుందని కనుగొన్నాము. జనాభా పెరుగుదలకు స్పెర్మ్ అవసరం. కానీ వాతావారణ మార్పుల వల్ల జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతోంది. అని ఆయన అన్నారు. 

Latest Videos

click me!