వెన్న VS నెయ్యి VS ఆలివ్ ఆయిల్.. బరువు తగ్గడానికి ఏది మంచిది?

First Published | Jul 3, 2021, 3:23 PM IST

బరువు తగ్గడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్ లు, ఆహారంలో క్యాలరీలు తగ్గించడం, ఫుడ్ లో ఆయిల్స్ ను దూరంగా పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన నూనెలు, వెన్నల గురించి ఎక్కువగా మాట్లాడతారు. 

బరువు తగ్గడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్ లు, ఆహారంలో క్యాలరీలు తగ్గించడం, ఫుడ్ లో ఆయిల్స్ ను దూరంగా పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన నూనెలు, వెన్నల గురించి ఎక్కువగా మాట్లాడతారు.
ఈ మధ్య కాలంలో నెయ్యి కూడా బరువు తగ్గడంలో ప్రముఖపాత్ర పోషిస్తుందనే వాదన మళ్లీ మొదలయ్యింది. ఇక ఆలివ్ ఆయిల్ గురించి చెప్పనక్కరలేదు. సలాడ్స్ లో.. వంటల్లో వాడుతుంటారు. మరికొంతమంది బట్టర్ ను కూడా డైటింగ్ లో భాగంగావాడతారు.

అయితే ఈ మూడింట్లో ఎందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. దేనివల్ల మీ డైటింగ్ పరిపూర్ణమవుతుంది? దేంతో మీరు తొందరగా బరువు తగ్గుతారు? ఈ మూడింటికీ ఉన్న తేడా ఏంటీ?
బరువు తగ్గడానికి కొవ్వులు : కేలరీలు బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి కొవ్వులు కూడా ఉపయోగపడతాయి. మీరు డైటింగ్ లో ఉండే మీ ఫుడ్ లో కొవ్వులను కూడా చేర్చాలి. వీటివల్ల క్యాలరీలు బర్న్ అవడం వేగవంతం అవుతుంది.
అంతేకాదు ఈ రకమైన కొవ్వులు తొందరగా కడుపునిండిన భావనను కలిగిస్తాయి. ఇంకా తినాలనే ఫీలింగ్ రాకుండా చేస్తాయి. అంతేకాదు ఇవి ఎ, డి,ఈతో సహా అవసరమైన విటమిన్‌లను గ్రహించడంలో తోడ్పడతాయి. అయితే ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే.. ఈ మూడింటిలో ఏది మంచిది? ఏది వాడాలి? అని..
వెన్నలోని ఆరోగ్య ప్రయోజనాలు : బరువు తగ్గడానికి కీటోడైట్ చేస్తున్నట్లైతే వెన్న మంచి ఆప్షన్. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా.. రెగ్యులర్ వంటనూనెకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
వెన్నమీద ఇప్పటివరకు ఉన్న అపోహలు నిజం కాదు. ఇది సరైన పరిమాణంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ లేవు. ఇది పాల ఉత్పత్తి కనుక ఇందులో విటమిన్ ఎ, ఇ, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియంలు లభిస్తాయి. ఇది శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వులు అధికంగా ఉండే వెన్నను ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడానికి వాడడం.ఒక చెంచా వెన్నలో 100 కేలరీలు, 12 గ్రాముల కొవ్వు ఉంటుంది.
బరువు తగ్గడానికి ఆలివ్ ఆయిల్ ఎలా సహాయపడుతుందంటే.. ఎన్నో కారణాలున్నాయి. ఆలివ్ఆయిల్ లో ఎన్నో ఆరోగ్యకరమైన లక్షణాలు, అధిక పోషకాలు ఉన్నాయి. డైట్ కంట్రోల్ చేసే బెస్ట్ నూనెగా ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరుంది. ఆలివ్ ఆయిల్ లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇది ఆరోగ్యకరమైన కొవ్వు. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సంతృప్తిని ప్రోత్సహిస్తుంది.ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో 119 కేలరీలు ఉంటాయి. 13.5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇక ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్లో 119 కేలరీలు ఉంటాయి. 13.5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇక ఎక్స్ ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
బరువు తగ్గడానికి నెయ్యి : నెయ్యి తింటే బరువు పెరుగుతారని అపోహ ఉన్నప్పటికీ.. ఇది బరువు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. వెన్నను మరిగిస్తే నెయ్యి వస్తుంది. ఇందులో ఎ, డి, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లు బాగా ఉంటాయి. కేసైన్ ఉండదు.
పాల ఉత్పత్తులతో ఎలర్జీ ఉన్నవారికి కూడా బాగా సరిపోతుంది. నెయ్యి గట్-ఫ్రెండ్లీ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇది సులభంగా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. పోషక విలువల విషయానికొస్తే, ఒక చెంచా నెయ్యిలో 115 కేలరీలు, 9.3 గ్రాముల సంతృప్త కొవ్వు, 0 పిండి పదార్థాలు, 38.4 గ్రాముల కొలెస్ట్రాల్ ఉన్నాయి, వెన్నలాగా, పరిమితంగా వాడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి.
మరి వీటిల్లో ఏది బెస్ట్ ఛాయిస్ ? : వెన్న, నెయ్యి, ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైన కొవ్వు వనరులు అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, మీ ప్రాధమిక ఆందోళన బరువు తగ్గడం అయితే, మీ ప్రాధాన్యతలు, జీవనశైలి,మొత్తం ఆహార వినియోగాన్ని బట్టి ఒక దాన్ని ఎంచుకోవడం మంచిది.
నెయ్యి, వెన్న రెండూ పాడి ఉత్పత్తులే. అందువల్ల, మీరు వేగనిజం ఫాలో అయితున్నట్లైతే.. ఆయిల్స్, నట్ బటర్ వాడడమే మంచిది. అయితే నెయ్యి, వెన్న రెండూ కీటో డైట్‌ కి మంచి ఎంపికలే.
కేలరీల సంఖ్య విషయానికొస్తే, వెన్నలో అన్నింటికంటే ఎక్కువ క్యాలరీలుంటాయి. ఇక ఈమూడింట్లో పోల్చితే ఆలివ్ ఆయిల్ ది బెస్ట్. మిగతావీ మంచివే కానీ వాడే పరిమాణాల్లో పరిమితులు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.

Latest Videos

click me!