ఆవు నెయ్యితో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు..

First Published Jul 2, 2021, 4:37 PM IST

భోజనాన్ని మరింత పోషకంగా, రుచికరంగ మార్చుకోవడంతో ఆవునెయ్యి పాత్రను తీసిపారేయలేం. మన వంటల్లో ఆవునెయ్యి ముఖ్యపాత్ర పోషించడానికి ఇదీ ఒక కారణమే. దీంతోపాటు ఇందులో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, బ్యూటిరిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలతో కూడి క్లారిఫైడ్ బటర్ అని కూడా పేరుపొందింది ఆవు నెయ్యి. 

భోజనాన్ని మరింత పోషకంగా, రుచికరంగ మార్చుకోవడంతో ఆవునెయ్యి పాత్రను తీసిపారేయలేం. మన వంటల్లో ఆవునెయ్యి ముఖ్యపాత్ర పోషించడానికి ఇదీ ఒక కారణమే. దీంతోపాటు ఇందులో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, బ్యూటిరిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలతో కూడి క్లారిఫైడ్ బటర్ అని కూడా పేరుపొందింది ఆవు నెయ్యి.
undefined
ఆవు నెయ్యే ఎందుకు అంటే..ఆయుర్వేదం, సిద్ధ వైద్యంలాంటి వాటిల్లో ఆవునెయ్యిని ప్రముఖంగా వాడతారు. దీనికి కారణం దీంట్లో ఔషధ లక్షణాలే. అలాగే ఆవునెయ్యిని చిన్నపాటి జబ్బులకు వంటింటి చిట్కాలుగా తరాలుగా వాడతున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న గాయాలు మొదలు జుట్టు రాలడం, అజీర్తి, గొంతునొప్పిలాంటి వాటికి కూడా ఆవునెయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
undefined
రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. ఆవునెయ్యితో మరిన్ని ఉపయోగాలు చూడండి..
undefined
జుట్టు సమస్యలకు సరైన పరిష్కారం : జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఆవునెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. నేటికాలంలో బ్యూటీ బిజినెస్ లో జుట్టు సమస్యలకు ఉన్నంత గిరాకీ మరిదేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. దాంతో పాటు జుట్టు చికిత్స చాలా ఖరీదుతో కూడుకున్నది. దీనికోసం ఆవునెయ్యి వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు.
undefined
రెగ్యలర్ గా మీరు వాడుతున్న నూనెను మార్చి వేడి నెయ్యితో తలకు మసాజ్ చేయండి. కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది మంచి పరిష్కారం. నీరసంగా, పొడిబారిన జుట్టుకు, సడెన్ గా రాలిపోతున్న జుట్టుచికిత్సకు ఇది బాగా పనిచేస్తుంది.
undefined
2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యికి 2 టీస్పూన్ల బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో పాటు రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్‌లను కలిపి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చేయాలి. తరువాత తలను కడిగేసుకోవాలి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.
undefined
బరువు తగ్గడంలో కూడా నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యులర్ గా మీరు వాడే వంటనూనెల స్థానాన్ని నెయ్యితో భర్తీ చేయండి. మీ బరువు క్రమంగా తగ్గడాన్ని మీరే గమనిస్తారు. కొవ్వును పేరుకుపోకుండా చేసే ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు నెయ్యిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కొవ్వును కరిగిపోయేలా చేస్తాయి. ఇంకా వీటిలో ఉండే ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. శరీరంలో నీటివల్ల ఏర్పడే బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. ఇది క్రమంగా బరువు తగ్గడం మీద ప్రభావం చూపిస్తుంది. అయితే నెయ్యిని ఎంత పరిమాణంలో తీసుకుంటాన్నారనేది కూడా లెక్కలోకి తీసుకోండి.
undefined
చర్మ సంరక్షణలోనూ నెయ్యి బాగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి, ఆరోగ్యకరంగా మార్చడానికి నెయ్యితో చేసే ఫేస్ ప్యాక్ లు మంచి ఫలితాలను ఇస్తాయి.
undefined
ఒక గిన్నెలో 2 టీస్పూన్ల నెయ్యి, 2 టీస్పూన్ల శనగపిండి, టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ పాలు, 1 టీస్పూన్ బియ్యం పిండి వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసి 25-30 నిమిషాల పాటు ఉంచి, కడిగేయండి. ఫలితాలు మీరే ఆశ్చర్యపోతారు.
undefined
మూసుకుపోయిన ముక్కును తెరిపిస్తుంది. వాతావరణ మార్పుల్లో భాగంగా ముందుగా అటాక్ అయ్యేది జలుబు. దీంతో ముక్కుదిబ్బడ పట్టేయడం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. దీనికోసం నెయ్యిని వేడిచేసి గోరువెచ్చగా చేసి ఒక డ్రాప్పర్‌ తో ముక్కులో వేసుకుంటే ముక్కులు వెంటనే తెరుచుకుంటాయి.
undefined
మలబద్ధకాన్ని తొలగిస్తుంది. మలబద్ధకంతో బాధపడుతున్నట్లైతే నెయ్యి చక్కటి పరిష్కారం. నెయ్యిలో ఉండే బ్యూటిరిక్ యాసిడ్ పేగు గోడలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణ ప్రక్రియ పనితీరును క్రమపరుస్తుంది. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది.
undefined
గ్లాసు వెచ్చని పాలలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా పసుపు కలిపి పడుకునే ముందు తాగితే మలబద్దకానికి బాగా పనిచేస్తుంది. మలబద్ధకం వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది. ఆహారం నుంచి పోషకాలు శరీరం లోకి శోషించడానికి సహాయపడుతుంది.
undefined
గొంతు నొప్పికి నెయ్యితో చేసే కఢా అద్భుతంగా పనిచేస్తుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో నల్ల మిరియాలు, ఉప్పు, అల్లం రసం వేసి బాగా కలపండి. మరోవైపు 1 ½ కప్పుల నీటిలో 2-3 తులసి ఆకులు వేసి మరిగించండి. ఈ మిశ్రమాన్ని వడకట్టి, నెయ్యి మిశ్రమాన్ని ఒక టీస్పూన్ తేనెతో కలపండి. దీన్ని మెల్లమెల్లగా తాగితే గొంతునొప్పి పోతుంది.
undefined
click me!