Acne Remedy: రూపాయి ఖర్చు పెట్టకుండా మొటిమను ఒక్కరోజులో మాయం చేసుకోండిలా

Published : Jul 17, 2026, 09:09 AM IST

Acne Remedy: ముఖంపై మొటిమలు రావడం సహజం. వాటిని చూసి భయడాల్సిన అవసరం లేదు.  రాత్రికి రాత్రే ఆ మొటిమను పోగొట్టుకునే చిట్కా ఉంది. దీని కోసం మీరు డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు.

PREV
13
మొటిమలు తగ్గించే చిట్కాలు

కొంతమందికి మొటిమల వచ్చిందంటే నిద్రపట్టదు. అది పోయే వరకు టెన్షన్ పడుతూనే ఉంటారు. మొటిమను త్వరగా పొగొట్టుకునేందుకు ఖరీదైనా క్రీములు వాడాల్సిన అవసరం లేదు. మన పెరట్లో ఉచితంగా దొరికే వేపతో రాత్రికి రాత్రే మొటిమను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం, ఆధునిక చర్మవ్యాధి నిపుణులు చెబుతున్న ప్రకారం   వేపలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలపై ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మ రంధ్రాలలో బ్యాక్టీరియా చేరడం వల్లే మొటిమలు వస్తాయి. వేపలో ఉండే ఔషధ గుణాలు ఈ బ్యాక్టీరియాను మూలాల నుంచి నాశనం చేస్తాయి.

23
జిడ్డు వల్లే మొటిమలు

మొటిమలు రావడానికి ప్రధాన కారణం జిడ్డు.  చర్మం నుంచి వెలువడే అదనపు జిడ్డు వల్ల మొటిమలు అధికంగా వస్తాయి. ఆ జిడ్డును నియంత్రించే శక్తి వేప ఆకులకు ఉంది. వీటివల్ల కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి. వేపలో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల కలిగే నొప్పి, వాపు, ఎరుపుదనాన్ని వెంటనే తగ్గిస్తాయి.

33
వేప ఆకులను ఇలా వాడండి

మొటిమలను తగ్గించుకోవడం కోసం కొన్ని తాజా వేపాకులను శుభ్రంగా కడిగి, మెత్తగా నూరి చిక్కటి పేస్టును తీసి పక్కన పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని సున్నితమైన ఫేస్‌వాష్‌తో కడుక్కోవాలి. మెత్తటి టవల్‌తో తుడుచుకోవాలి. ఇప్పుడు శుభ్రమైన కాటన్ బడ్‌ను వేప రసంలో ముంచి కేవలం మొటిమ ఉన్న చోట మాత్రమే ఒక చుక్క రాయాలి. ముఖమంతా రాయాల్సిన పని లేదు. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఉదయం అద్దంలో చూసుకునేసరికి మొటిమ వాపు తగ్గి, పొడిగా మారిపోతుంది. మొటిమలు త్వరగా తగ్గిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories