Glowing Skin Tips: పైసా ఖర్చు లేకుండా కిచెన్ లో దొరికే ఈ పదార్థాలతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!

Published : Jun 06, 2026, 05:00 PM IST

Glowing Skin Tips: అందమైన, కాంతివంతమైన చర్మం కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. వాడని ప్రోడక్టులు ఉండవు. కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే కొన్ని సహజ పదార్థాలతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

PREV
17
గ్లోయింగ్ స్కిన్ చిట్కాలు

మెరిసే చర్మం కోసం చాలామంది అమ్మాయిలు ఖరీదైన క్రీములు, సీరమ్ లు వాడుతుంటారు. కానీ మన వంటగదిలో దొరికే కొన్ని సహజ పదార్థాలు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయం మీకు తెలుసా? మరి ఆలస్యమెందుకు ఏ పదార్థాలు ముఖ సౌందర్యానికి సహాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.

27
తేనె ఫేస్ ప్యాక్

తేనె చర్మ సంరక్షణకు చక్కగా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖంపై తేనెను పలుచగా రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా పొడిబారిన చర్మం ఉన్నవారికి తేనె మంచి సహజ మాయిశ్చరైజర్‌ లా పనిచేస్తుంది.

37
పెరుగుతో ఫేస్ ప్యాక్

పెరుగు కూడా చర్మ కాంతిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రెండు చెంచాల పెరుగులో కొద్దిగా తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా ఉపయోగిస్తే చర్మానికి సహజమైన గ్లో వస్తుంది.

47
పసుపుతో ఫేస్ ప్యాక్

పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. చిటికెడు పసుపును పెరుగు లేదా తేనెలో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు, నలుపు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే పసుపును మితంగా ఉపయోగించడం మంచిది.

57
నిమ్మరసంతో ఫేస్ ప్యాక్

నిమ్మకాయలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అయితే నిమ్మరసాన్ని తేనె లేదా పెరుగుతో కలిపి ఉపయోగించడం మంచిది. నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాయడం వల్ల కొందరిలో చికాకు లేదా అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.

67
పాలు, బాదం ఫేస్ ప్యాక్

పాలు, బాదం కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడితే, బాదంలో ఉండే విటమిన్-ఇ చర్మాన్ని పోషించి కాంతివంతంగా ఉంచుతుంది. రాత్రంతా నానబెట్టిన బాదంను మెత్తగా చేసి పాలలో కలిపి ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మానికి తగిన పోషకాలు అందుతాయి.

77
చర్మ ఆరోగ్యం కోసం..

నిపుణుల ప్రకారం ఈ ఫేస్ ప్యాక్‌లతో పాటు రోజుకు తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం, సరిపడ నిద్రపోవడం, సన్‌స్క్రీన్ ఉపయోగించడం వంటి అలవాట్లు కూడా ముఖ్యం. విటమిన్-సి, విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగిన ఆహారాలు చర్మ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories