Gas in stomach: గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే వీటిని పొరపాటున కూడా తినకండి..

Published : Jun 06, 2022, 04:03 PM IST

Gas in stomach: కడుపులో గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే అవి సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. 

PREV
16
Gas in stomach: గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే వీటిని పొరపాటున కూడా తినకండి..

ఆధునిక జీవనశైలిలో ఎసిడిటీ, గ్యాస్ సమస్య, మానసిక అలసట వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య గృహిణులు, యువత, వృద్ధులల్లో కూడా కనిపిస్తుంది. కడుపులో ఏర్పడే వాయువు కొన్నిసార్లు గుండెకు కూడా హానీ చేస్తుంది. ఇలాంటి వారు కొన్నిరకాల ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

26

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు కూడా గ్యాస్ ఏర్పడుతుంది. దీని వల్ల మన శరీరంలో అనేక రకాల సమస్యలు రావడం మొదలవుతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్రైడ్-రోస్ట్ తినడం ద్వారా ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అయితే గ్యాస్ సమస్యను వేగంగా పెంచే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి.

36

ఎక్కువగా తినడం లేదా ఎక్కువ సేపు ఏమీ తినకపోవడం వల్ల కూడా కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అదే సమయంలో మసాలా దినుసులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది. గ్యాస్ వల్ల కడుపు తిమ్మిరితో పాటుగా శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి కలుగుతుంది. ఈ వాయువు ఏర్పడినప్పుడు నత్తిగా మాట్లాడటం ప్రారంభమవుతుంది కూడా. దీంతో మీరు ఏమీ చేయకున్నా అలసిపోయినట్లు భావిస్తారు. కడుపు నొప్పితో పాటు వాంతులు వచ్చేట్టుగా కూడా అనిపిస్తుంది. 
 

46

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్ కు దారితీస్తుంది. ఈ విధంగా మీరు టీ తాగుతున్నట్లయితే..  టీ కంటే ముందుగా తేలికపాటి అల్పాహారం తీసుకోండి. ఇది పొట్టలో గ్యాస్ ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది. టీ తాగేటప్పుడు గ్యాస్ ను సమస్యను పెంచే బ్రేక్ ఫాస్ట్ ను మాత్రం తినొద్దు. గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు వారికి పడని ఆహారాలను తినకపోవడమే మంచిది. 

56

ప్రతి మనిషిలో గ్యాస్ ఏర్పడటానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ.. చాలా మందిలో, పాల టీ, చోలే, రాజ్మా, అరబిక్, కాలీఫ్లవర్, పోహా, సలోని, మైదాతో తయారు చేసిన ఫుడ్స్ వల్ల గ్యాస్ ఏర్పడుతుంది. ఒక వేళ వీటిని తింటే.. తిన్న తర్వాత మీరు కాసేపు ఖచ్చితంగా నడవాలి. తద్వారా మీరు ఈ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోగలుగుతారు.
 

66

ఈ సమస్య ఉన్నవాళ్లు ఉదయం, సాయంత్రం వేళల్లో నడవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు హాయిగా నిద్రపోతారు. తిన్న తర్వాత ఎక్కువగా నీళ్లను తాగకూడదు. అలాగే తిన్న వెంటనే నిద్రపోవడం మీ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.  తిన్నతర్వాత కూడా కాసేపు నడవండి. గ్యాస్ వల్ల శరీరంలోని ఏ భాగంలోనైనా నొప్పి కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories