మట్టితో..
మట్టితో కూడా ఇంట్లోనే చాలా సులువుగా వినాయకుడి విగ్రహాన్ని తయారుచేయొచ్చు. ఇందుకోసం బంకమట్టిని తీసుకుని అందులో నీళ్లు పోసి గోధుమ పిండిలా బాగా కలపాలి. ఈ మట్టిని కాసేపు అలాగే ఉంచండి. గంట తర్వాత విగ్రహాన్ని తయారుచేయండి. విగ్రహానికి ఆకారం ఇచ్చిన తర్వాత వినాయకుడి తొండం, చేతులు, కాళ్లు తయారు చేయండి. విగ్రహం తయారైన తర్వాత ఆరనివ్వండి. విగ్రహం ఆరిన తర్వాత వాటర్ కలర్ తో పెయింట్ వేయండి.