వినాయక చవితి రోజు ఈ పనిచేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి

First Published | Sep 17, 2023, 10:37 AM IST

Ganesh Chaturthi 2023: హిందూ సంప్రదాయం ప్రకారం.. ఏదైనా శుభకార్యం చేసేముందు ఖచ్చితంగా వినాయకుడిని పూజిస్తారు. ఎందుకంటే వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా సజావుగా జరుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది వినాయక చవితిని ఈ నెల 19 న అంటే మంగళవారం నాడు జరుపుకోబోతున్నాం. 
 

ganesh chaturthi 2023

Ganesh Chaturthi 2023: వినాయకుడు తన భక్తులకున్న అన్ని రకాల బాధలను పోగొడుతారు. అందుకే ఈ భగవంతుడిని విఘ్నహర్త అంటాడు. సెప్టెంబర్ నుంచి భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గో రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. అయితే వినాయక చవితి నాడు కొన్ని పనులు చేస్తే వినాయకుడి ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Ganesh Chaturthi 2023

గణేశుడు దుర్వ గడ్డికి ఎంతో ప్రీతిపాత్రుడు. అందుకే వినాయకుడి ఆరాధనలో, పూజలో ఖచ్చితంగా దుర్వాను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అందుకే 11 దుర్వా గడ్డి కట్టలను,  ఒక పసుపు ముద్ద తీసుకుని పసుపు రంగులో ఉండే వస్త్రంలో కట్టాలి. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు దీన్ని పూజించండి. ఆ తర్వాత  డబ్బుకు ఎలాంటి కొదవ రాకుండా ఉండేందుకు ఈ వస్త్రాన్ని మీ సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి.  దీనివల్ల మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొదవా ఉండదు. 
 

Latest Videos


Ganesh Chaturthi 2023

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయమే లేచి తలస్నానం చేయండి. ఆ తర్వాత బెల్లంలో దేశీ నెయ్యి కలిపి వినాయకుడికి నైవేధ్యాన్ని సమర్పించండి. ఆ తర్వాత దీనిని ఆవుకు తినిపించండి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బులు బాగా సమకూరుతాయి. అలాగే వినాయక చవితి నాడు బెల్లంతో 21 చిన్నఉండటలను తయారుచేయండి. వీటిని దుర్వాతో కలిపి గణేష్ ఆలయంలో సమర్పిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Ganesh Chaturthi 2023

వినాయక చవితి రోజున.. మీ ఇంటి గుడిలో గణేష్ యంత్రాన్ని ప్రతిష్టించండి. దీనితో పాటుగా ఈ యంత్రాన్ని వినాయకుడితో పాటు క్రమం తప్పకుండా పూజించండి. ఇది ఇంట్లో సంపద, శ్రేయస్సును పెంచుతుంది. వీటితో పాటుగా గణపతికి క్రమం తప్పకుండా అభిషేకం కూడా చేయండి. ఇలా చేయడం వల్ల ప్రత్యేక ఫలాలు పొందుతారు. వీటితో పాటుగా గణపతి అధర్వశిర్ష పారాయణం కూడా చేయండి. 

click me!