విపరీతమైన సెక్స్ కోరికలు.. కారణం ఇదే..!

First Published | Sep 17, 2023, 11:20 AM IST

కొంతమందికి సెక్స్ పట్ల విపరీతమైన కోరికలు ఉంటాయి. రోజంతా దానిగురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అలాగే వీరి శరీరం ఎప్పుడూ ఉత్తేజితంగానే ఉంటుంది. వీటన్నింటి వెనుక ఒక కారణముందంటున్నారు నిపుణులు. అవేంటంటే..?
 

ప్రస్తుతం చాలా మంది జీవనశైలి మారింది. కానీ ఈ చెడు జీవనశైలి మీ శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కొంతమందికి సెక్స్ పట్ల కోరికలు బాగా తగ్గిస్తుంది. ఇంకొందరికి విపరీతమైన కోరికలు ఉంటాయి. మీకు తెలుసా? ఎప్పుడూ సెక్స్ గురించే ఆలోచించేవారికి వ్యక్తి తన భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టం. ఇది మిమ్మల్నే కాదు మీ భాగస్వామిని కూడా ప్రభావితం చేస్తుంది. ఏదేమైనా సెక్స్ ఇద్దరి సమ్మతితోనే జరగాలి. దీనిలో ఒత్తిడి చేయకూడదు. కాగా విపరీతమైన సెక్స్ కోరికలున్న భాగస్వామి ప్రవర్తన మరో భాగస్వామిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీంతో వైవాహిక జీవితం సాఫీగా సాగదు. విడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అసలు మితిమీరిన సెక్స్ కోరికలు ఎందుకు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

హార్మోన్లు

మన జీవితంలో హార్మోన్ల పాత్ర చాలా పెద్దది. అయితే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, టెస్టోస్టెరాన్ లు సెక్స్ జీవితాన్ని నియంత్రిస్తాయి. ఇవి మరీ తక్కువగా ఉంటే మీ సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. అందుకే ఈ హార్మోన్లు ఎప్పుడూ కూడా నియంత్రణలోనే ఉండాలి. అండోత్సర్గమునకు ముందు, ఆ తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. దీంతో వారి సెక్స్ డ్రైవ్ కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఆడవారు ఎంతో ఆందోళన చెందుతుంటారు. అంతేకాక పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరిగినప్పుడు వారికి లైంగిక వాంఛ బాగా పెరుగుతుంది. ఈ సెక్స్ హార్మోన్లు ఎక్కువగా ఉంటే లైంగిక కోరికలు కూడా బాగా పెరుగుతాయి. 


Food helps for sex

వయసు 

నిజానికి వయసు పెరిగే కొద్దీ సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతూ వస్తుంది. అయితే యుక్త వయసులో ఉన్నవారికి సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాగా కౌమారదశలో ఉన్న అబ్బాయిల్లో ఈ టెస్టోస్టెరాన్ ఉత్పత్తి 10 రెట్లు పెరుగుతుందట.  అందుకే కౌమారదశలో ఉన్న అబ్బాయిల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయట. 

Couples after sex

ఎక్కువ వ్యాయామం

శారీరక శ్రమ పెరిగితే బరువు తగ్గుతారు. అంతేకాదు దీనివల్ల సెక్స్ కోరికలు కూడా బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. 2018లో ఓ నిర్వహించిన ఓ అధ్యయనం.. మితిమీరిన శృంగారానికి, శారీరక దృఢత్వానికి ఉన్న సంబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది.
 

ఆహారాలు

మీరు తినే కొన్ని రకాల ఆహారాలు కూడా మీ లైంగిక కోరికలను విపరీతంగా పెంచుతాయి. అంజీరలు, స్ట్రాబెర్రీలు, డార్క్ చాక్లెట్ వంటి కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే మీకు సెక్స్ కోరికలు బాగా పెరిగిపోతాయి. 

హైపర్ సెక్సువాలిటీ

పై కారణాలతో పాటుగా హైపర్ సెక్సువాలిటీ కూడా మీ లిబిడో పెరగడానికి కారణమవుతుంది. హైపర్ సెక్సువాలిటీ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎప్పుడూ సెక్స్ గురించే ఆలోచిస్తారు. నిపుణుల ప్రకారం.. ఇదొక మానసిక సమస్య. ఇది లైంగిక ఆలోచనలు, ఉద్దీపనలతో సంబంధం కలిగి ఉంటుంది. 
 

సెక్స్ పట్ల మితిమీరిన ఆసక్తిని ఎలా తగ్గించుకోవాలి?

సెక్స్ పట్ల కోరికలు ఉండాలి. కానీ అవి మీరు నియంత్రించలేనివిధంగా ఉండకూడదు. విపరీతమైన సెక్స్ కోరికలతో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి కోరికలను నియంత్రించాలి. సెక్స్ పట్ల ఆలోచన వచ్చినప్పుడు వేరే పనుల్లో నిమగ్నం కావడానికి ప్రయత్నించండి. అంటే మీకు ఇష్టమైన సాంగ్స్ ను వినడం, గేమ్స్ ఆడటం, ఇంటి పనులు చేయడం వంటి పనుల్లో బిజీగా ఉండండి. అలాగే..

యోగా, ధ్యానం వంటి పద్దతుల ద్వారా కూడా మితిమీరిన సెక్స్ కోరికలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయాలి. 0

అలాగే లైంగిక కోరికలను కలిగించే ఆహారాలకు దూరంగా ఉండండి.

ఒకవేళ ఈ సమస్యలను మీరు అదుపుచేయలేకపోతే నిర్మొహమాటంగా హాస్పటల్ కు వెళ్లండి. 

Latest Videos

click me!