Ganesh Chaturthi 2022: వినాయక చవితి ఎప్పుడు? గణేష్ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమై.. ఎప్పుడు ముగుస్తాయి..

First Published | Aug 24, 2022, 10:32 AM IST

Ganesh Chaturthi 2022: శివుని కుమారుడైన గణేషుడికి గణేష్ చతుర్థి సందర్భంగా పదిరోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి. ఈ పదిరోజులు గణేషుడిని నిష్టగా పూజించడం వల్ల మన కోరికలన్నీ ఫలిస్తాయని ప్రజలు నమ్ముతారు. 

ganesh chaturthi 2022

ఎలాంటి శుభకార్యాలకైనా.. ముందుగా మనం పూజించేది వినాయకుడినే. వినాయకుడిని పూజించడం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయని ప్రజల నమ్మకం. అందుకే పెళ్లిళ్లు, పేరంటాలకు ఈ బొజ్జ గణపయ్యనే కొలుస్తారు. ఇకపోతే పది రోజుల పాటు నిష్టగా సిద్దేశ్వరుడిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రజలకు గట్టి నమ్మకం. శివపార్వతుల గారాల కుమారుడు గణేషుడు పుట్టిన రోజే మనం జరుపుకునే వినాయక చవితి. ఈ పండుగ హిందువులకు ఎంతో పవిత్రమైంది. 
 

ganesh chaturthi 2022

హిందూ సంప్రదాయం ప్రకారం.. వినాయక చవితి పండుగను భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు జరుపుకుంటారు. ఇక మొదటి రోజున వినాయకుడి ప్రతిష్టిస్తారు. ఆ రోజు నుంచి పదిరోజుల పాటు వినాయకుడిని నిష్టగా.. రకరకాల పలహారాలతో పూజిస్తారు. ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది వినాయకుడి నిమజ్జనం సెప్టెంబర్ 9న వచ్చింది. 
 


ganesh chaturthi 2022

ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 30న మధ్యాహ్నం 03:33 గంటలకు ప్రారంభం కానుంది. అంటే వినాయక చివితిని మనం 31న జరుపుకుంటాం.  ఆ రోజే వినాయకుడి ప్రతిష్టిస్తారు. సెప్టెంబర్ 09 నాడు గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ పదిరోజుల పాటు గణేషుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక గణేషుడి నిమజ్జనం రోజున ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో ఊరూరా ఊరేగింపు కూడా ఉంటుంది. 

వినాయక చవితి తేది: బుధవారం (ఆగస్టు 31)

వినాయక నిమజ్జనం: శుక్రవారం, సెప్టెంబర్ 9

ganesh chaturthi 2022

వినాయక చవివి నాడు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి గణేపతిని పూజించాలి. ఆ రోజున శుభప్రదమైన పసుపు రంగు దుస్తులను వేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. బొజ్జ  గణపయ్యను గంగాజలంతో అభిషేకం చేసి పూలు, అక్షింతలు వంటివి సమర్పించాలి. గణపయ్యకు లడ్డూలను కూడా సమర్పించి హారతి ఇవ్వాలి. ఈ రోజున గణేషుడి మంత్రాలను జపించడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  

Latest Videos

click me!