మీ కన్ను ఎన్ని మెగాపిక్సెల్ కెమెరాల‌కు సమాన‌మో తెలుసా?

First Published Sep 15, 2024, 10:02 PM IST

Eye Lens Megapixel:  ప్ర‌స్తుతం మార్కెట్ లోకి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ వ‌స్తోంది. ప్ర‌తిసారి ప్ర‌త్యేకంగా వినిపించే మాట కెమెరా క్వాలిటీ గురించి. యూజ‌ర్లు సైతం ఎంత మెగాపిక్సెల్ కెమెరా అని చూస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లో 5, 10 పోయి ఏకంగా 200 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ లు కూడా వ‌చ్చాయి. ఇవి మ‌రింత క్వాలిటీగా ఫోటోల‌ను అందిస్తాయి. మ‌రీ మీ క‌న్ను ఎంత మెగా పిక్సెల్ ఉంటుందో మీకు తెలుసా? 
 

How many megapixels is an eye?

Eye Lens Megapixel: రోజురోజుకూ సాంకేతిక‌త కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఈ కొత్త టెక్నాల‌జీ మానవ  జీవితాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేసింది. ఫోన్ల విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతోంది. రోజుకో కొత్త టెక్ ఫీచ‌ర్ తో స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వ‌స్తున్నాయి. వీటిలో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సింది వాటి కెమెరాల గురించి. 

What is the pixels of eye lens?

ఎక్కువ మెగాపిక్సెల్‌లతో కూడిన కెమెరా మెరుగైన ఫోటోలు, మ‌రింత స్ప‌ష్ట‌మైన‌ నాణ్యతతో ఫోటోల‌ను అందిస్తాయి. ప్ర‌స్తుతం మార్కెట్ లో భారీ పిక్స‌ల్స్ కెమెరాల‌తో స్మార్ట్ ఫోన్లు వ‌స్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ల కెమెరాలు మన కళ్ళలోని మెగాపిక్సెల్‌లకు ఏమాత్రం సరిపోలేవు. మీ ఫోన్ కెమెరా మెగాపిక్స‌ల్ ఎంతో మీకు తెలుసు. మ‌రీ మీ క‌ళ్ల మెగా పిక్స‌ల్ ఎంతో మీకు తెలుసా? 

స్మార్ట్ ఫోన్ లో లెన్సులు, పిక్స‌ల్ కెమెరా మ్యాడ్యూల్స్ తో ఫోటోల‌ను సేక‌రిస్తాయి. ఇదే మాదిరిగా మన కళ్లలో సహజమైన లెన్స్ ఉంటాయి. ఇది ఈ డిజిట‌ల్ కెమెరాల కంటే ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ఎంతో విలువైన‌ది. దాంతో పోలిస్తే చాలా భిన్నంగా కూడా కెమెరాలా పనిచేస్తుంది. 

Latest Videos


How much is 576 megapixels?

ఈ లెన్స్ గాజుతో తయారు చేసిన‌వు కావు కానీ, అత్యంత క్లిష్ట‌మైన మన శ‌రీర క‌ణ‌జాలం, నాడుల‌తో అనుసంధాన‌మై ఉంటుంది. అయితే, మ‌న క‌న్ను మెగా పిక్స‌ల్ గ‌న‌క లెక్కిస్తే అది 576 మెగాపిక్సెల్‌ల వరకు వీక్షణలను చూపగలదు. 

అంటే మన కంటి లెన్స్ 576 మెగాపిక్సెల్‌లకు సమానం. ఇక్క‌డ గ‌మ‌నించాల్సి విష‌యం ఏమిటంటే 576 మెగా పిక్సెల్ కెమెరాను ఫోన్ ను తీసుకువ‌చ్చినా మ‌న కండ్ల‌తో చూసే విధంగా నాచుర‌ల్ గా చూపించ‌లేవ‌ని, అలాంటి అనుభూతిని కూడా క‌లిగించ‌లేవ‌ని వైద్య‌ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Eye Lens Megapixel

డిజిట‌ల్ కెమెరాల మాదిరిగానే మ‌న క‌ళ్లు కూడా దృశ్యాల‌ను చూడ‌టానికి కెమెరాల మాదిరిగా ప‌నిచేస్తాయి.  ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి. మొదటిది లెన్స్, ఇది కాంతిని సేకరించి ఒక చిత్రాన్ని ఏర్పరుస్తుంది. 

రెండవది సెన్సార్, ఇది ఇమేజ్ లైట్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌గా మారుస్తుంది. మూడవది ప్రాసెసర్, ఇది ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్‌లను ఇమేజ్‌లుగా మారుస్తుంది. వాటిని స్క్రీన్‌పై ప్రదర్శిస్తుంది. 

Human Eye Lens Megapixel

మ‌న కన్ను ఒకేసారి 576 మెగాపిక్సెల్‌లను చూడగలదు, కానీ మన మెదడు ఈ డేటా మొత్తాన్ని ఒకేసారి ప్రాసెస్ చేయదు. ఇది హై డెఫినిషన్‌లో కొన్ని భాగాలను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, కాబట్టి ఏదైనా దృశ్యాన్ని సరిగ్గా చూడాలంటే మనం మన కళ్ళను ఆ దిశలో కదిలించాలి.

అయితే, పెరుగుతున్న వయస్సుతో కళ్ళ సామర్థ్యం, మెగాపిక్సెల్‌లు ప్రభావితమవుతాయ‌ని వైద్య ప‌రిశోధ‌కులు గుర్తించారు. వయసు పెరిగేకొద్దీ, మన శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే, కళ్ళ రెటీనా కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది.

What is the highest megapixel in the eye?

అంటే కంటి చూపు మంద‌గిస్తూ ఉంటుంది. ఇది మన చూసే సామర్థ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. కళ్ళ మెగాపిక్సెల్ సామర్థ్యం కూడా మారుతుంది. కాగా, జంతు సామ్రాజ్యంలో ఈగల్స్ (డేగ కన్ను) క‌ళ్లు బలంగా ఉంటాయి. దాని కంటి చూపు సగటు మానవుడి కంటే 4 నుండి 8 రెట్లు బలంగా ఉంటుందని అంచనా.

సగటు మానవుడి కంటిలో 120° వీక్షణకు 576 మెగాపిక్సిల్స్ ఉంటాయి. డేగ కంటి దృష్టి సగటు మానవుడి కంటే 4 నుండి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది.

click me!