4. పెళ్లి కూతురు కిడ్నాప్.
రొమేనియా పెళ్లి రిసెప్షన్‌లో స్నేహితులు సరదాగా వధువును కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత వరుడు తన భార్యను విడిపించుకోవడానికి షాంపైన్ ఇవ్వడం, డ్యాన్స్ చేయడం లేదా కొన్ని సరదా టాస్క్‌లు పూర్తి చేయడం చేయాల్సి ఉంటుంది. పెళ్లి వేడుకలో అతిథులకు ఇది మంచి వినోదాన్ని పంచుతుంది.
5. వివాహ బంధానికి ప్రతీకగా ఐరిష్ 'రింగ్-వార్మింగ్'
ఐర్లాండ్‌లో జరిగే పెళ్లిళ్లలో 'రింగ్-వార్మింగ్' అనే అందమైన ఆచారం ఉంది. పెళ్లికి ముందు ఉంగరాలను అతిథులందరి చేతుల మీదుగా పాస్ చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆ ఉంగరాలను కాసేపు చేతిలో పట్టుకొని ఆ జంట కోసం మనసారా శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆ విధంగా అతిథులందరి ఆశీస్సులు పొందిన తర్వాతే ఆ ఉంగరాలను వధూవరులు ధరిస్తారు.
6. కన్నీటి వీడ్కోలు
టర్కీలో జరిగే 'కినా గెసెసి' ఎంతో భావోద్వేగంగా సాగుతుంది. వధువు అరచేతిలో గోరింటాకు పెట్టే సమయంలో అందరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను, పుట్టింటిని వీడుతున్న బాధను గుర్తుచేసే పాటలు పాడుతారు. ఆ సమయంలో వధువుతో పాటు ఆమె తల్లి కూడా కన్నీరు పెట్టుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
7. అదృష్టం కోసం గ్రీకు బాదం పప్పులు
గ్రీకు వివాహ వేడుకల్లో అతిథులకు 'కూఫెటా' అనే షుగర్ కోటింగ్ చేసిన బాదం పప్పులను బహుమతిగా ఇస్తారు. ఇవి ఎప్పుడూ బేసి సంఖ్యలోనే ప్యాక్ చేస్తారు. ఎందుకంటే బేసి సంఖ్యను ఎప్పటికీ సమానంగా విభజించలేము. అలాగే బాదం చేదుగా, షుగర్ తియ్యగా ఉంటుంది.. ఇది జీవితంలో కష్టసుఖాలకు ప్రతీక.