Bedroom Deep Cleaning: ఎంత క్లీన్ చేసినా బెడ్ రూంలో దుమ్ము ఉంటుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

Published : Sep 29, 2026, 11:04 AM IST

Bedroom Deep Cleaning: బెడ్ రూం ఎంత నీట్ గా కనిపించినా కనిపించని దుమ్ము, క్రిములు అక్కడే పేరుకుపోతుంటాయి. దానివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. బెడ్ షీట్లు వారానికోసారి ఉతకడం, బెడ్ ను ఎండలో ఆరేయడం సహా 5 సింపుల్ టిప్స్ తో పడకగదిని క్లీన్ గా ఉంచుకోవచ్చు.

PREV
14
బెడ్‌పై కంటికి కనిపించని క్రిములు

రోజూ ఉదయం లేవగానే బెడ్‌షీట్ దులిపి, దిండ్లు సర్దుతాం. మంచం నీట్‌గా ఉంటే గది మొత్తం శుభ్రంగా ఉన్నట్లే ఫీల్ అవుతాం. కానీ నిజానికి బెడ్‌పైనే దుమ్ము, చెమట, డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. కేవలం బెడ్‌షీట్ మార్చినంత మాత్రాన ఈ మురికి పోదు. దానివల్ల బ్యాడ్ స్మెల్ వస్తుంది. బెడ్ షీట్లు వారానికోసారి ఉతకడం, బెడ్ ను ఎండలో ఆరేయడం సహా 5 సింపుల్ టిప్స్ తో పడకగదిని క్లీన్ గా ఉంచుకోవచ్చు.

దీనివల్ల అలర్జీలు, ముక్కు దిబ్బడ, దురద, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. అందుకే రోజూ ఇల్లు ఊడవడంతో పాటు వారానికోసారైనా బెడ్‌రూమ్‌ను 'డీప్ క్లీనింగ్' చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీనికి పెద్దగా టైమ్ పట్టదు, కేవలం 30-40 నిమిషాల్లో ఈ 5 పనులు ఈజీగా చేసేయొచ్చు.

24
1. ముందుగా బెడ్‌తోనే మొదలుపెట్టండి

వారానికోసారి బెడ్‌షీట్, దిండు కవర్లను వేడి నీళ్లలో ఉతకాలి. పరుపును వాక్యూమ్ క్లీనర్‌తో బాగా శుభ్రం చేయండి. వాక్యూమ్ క్లీనర్ లేకపోతే, పరుపును ఓ రెండు గంటల పాటు ఎండలో పెట్టండి. దిండ్లను కూడా ఎండలో వేయాలి. ఇలా చేస్తే అందులో ఉండే డస్ట్ మైట్స్ చనిపోతాయి.

2. కర్టెన్లు, కిటికీలు

బెడ్‌రూమ్‌లోని కర్టెన్లకు చాలా దుమ్ము పట్టుకుంటుంది. వారానికోసారి వాటిని దులపండి లేదా వాక్యూమ్ చేయండి. కిటికీ గ్రిల్స్, స్లైడింగ్ డోర్ల సందులను తడి బ్రష్‌తో క్లీన్ చేయండి. అద్దం లేదా డ్రెస్సింగ్ టేబుల్‌ను తుడిస్తే గది వెంటనే మెరిసిపోతుంది.

34
3. ఎలక్ట్రానిక్ వస్తువులు

ఏసీ, ఫ్యాన్ రెక్కలు, ట్యూబ్ లైట్లపై పేరుకుపోయే దుమ్ము గదిలోనే తిరుగుతూ ఉంటుంది. వారానికోసారి పొడి క్లాత్ తో ఫ్యాన్ రెక్కలను తుడవండి. సైడ్ టేబుల్, బీరువా పైభాగం, స్విచ్ బోర్డు లాంటి చోట్ల డిస్‌ఇన్‌ఫెక్టెంట్ స్ప్రే కొట్టి శుభ్రం చేయండి.

44
4. మంచం కింద కూడా క్లీన్ చేయండి

మంచం కింద, బీరువా వెనుక, కిటికీ మూలల్లోనే దుమ్ము ఎక్కువగా చేరుతుంది. ఈ ప్లేస్‌లను మనం రోజూ ఊడ్చం. అందుకే వారానికోసారి తడి క్లాత్ తో లేదా మాప్‌తో ఈ మూలలను తుడవండి. మంచం కింద అవసరం లేని వస్తువులను పెట్టకండి. అప్పుడే గాలి బాగా ఆడుతుంది. లేకపోతే చాలా దుర్వాసన వస్తుంది. అక్కడే దోమలు కూడా చేరుకుంటాయి. అందుకే మంచాలు, సోఫాల మూలలు వీలైనంత వరకూ క్లీన్ చేసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories