మోకాలి నొప్పులా.. ఈ స్ట్రెచెస్ తో చిటికెలో మాయం..

First Published Aug 27, 2021, 2:24 PM IST

ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా మోకాలి నొప్పులు వస్తాయి. గంటల తరబడి కూర్చుని ఉండడం, కూర్చునే పొజిషన్, కుర్చీ సరిగా ఉండకపోవడం.. ఒకే పొజిషన్ లో కూర్చోవాల్సి రావడం.. ఇలాంటి అనేక కారణాల వల్ల మోకాళ్లు ప్రబావితం అవుతాయి. 

మోకాలి నొప్పులు ప్రతీ ఒక్కరినీ ఇబ్బంది పెట్టే అంశం. ఇదివరకు వయసు మీదపడిన తరువాత మోకాలి నొప్పులు మొదలయ్యేవి. కానీ నేటి ఆధునిక జీవవవిధానం, ఒత్తిడి, ఉరుకులు పరుగులతో.. వయసుతో సంబంధం లేకుండా ముప్పైల్లోకొచ్చేసరికే మోకాలి నొప్పుల బారిన పడుతున్నారు. దీనివల్ల కాలు కదపలేము.. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. 

చిన్న వయసులో మోకాలి నొప్పులు ఎందుకు వస్తాయి. అంటే ఒకేసారి ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కూడా మోకాలి నొప్పులు వస్తాయి. గంటల తరబడి కూర్చుని ఉండడం, కూర్చునే పొజిషన్, కుర్చీ సరిగా ఉండకపోవడం.. ఒకే పొజిషన్ లో కూర్చోవాల్సి రావడం.. ఇలాంటి అనేక కారణాల వల్ల మోకాళ్లు ప్రబావితం అవుతాయి. 

దీనికి పరిష్కారం లేదా.. అంటే కొన్ని రకాల స్ట్రెచెస్ వల్ల ఇలా వచ్చే మోకాలి నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందులో మొదటిది హామ్ స్ట్రింగ్ (Hamstring Stretch) స్రెచ్.. ఈ వ్యాయామం వల్ల మోకాలి జాయింట్స్ వదులయ్యి నొప్పి తగ్గుతుంది. ప్లెక్సిబిలిటీ పెంచుతుంది. గాయాలయ్యే అవకాశాలను తగ్గించి, సరైన పోశ్చర్ ను అభివృద్ధి చేస్తుంది. 

క్రిసెంట్ లంగ్ (Crescent Lunge) : ఎక్కువసేపు కదలకుండా, ఒకేచోట కూర్చోవాల్సి రావడం వల్ల ఎముకల జాయింట్స్ బిగుసుకుపోతాయి. దీనివల్లే మోకాలి నొప్పులకు దారి తీస్తుంది. క్రిసెంట్ లంగ్ వ్యాయామం వల్ల నడుపు ప్రాంతంలో స్ట్రెచ్ అవ్వడం వల్ల కండరాలు ఫ్రీ అవుతాయి. దీనివల్ల మోకాలి నొప్పులకు చెక్ పెట్టొచ్చు.

Calf Stretch

కాఫ్ స్ట్రెచ్ (Calf Stretch) : ఈ స్ట్రెచ్ వల్ల కాలి పిక్కలభాగంలో వచ్చే నొప్పులనుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడి కండరాల్లో మార్పులు, నొప్పి కూడా మోకాలి నొప్పులకు దారి తీస్తుంది. 

Quadriceps Stretch

క్వాడ్రిసెప్స్ స్ట్రెచ్ (Quadriceps Stretch) : తొడభాగంలో ఉండే నాలుగు రకాల కండరాలకు సంబంధించిన స్ట్రెచ్. దీనివల్ల ఈ కండరాలు బిగుసుకుపోకుండా ఫ్రీ అవుతాయి. దీంతో మోకాలి నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

కాళ్లను ఆకాశం వైపు ఎత్తడం : నేలపై వెల్లకిలా పడుకుని చేతులు నేలపై ఆనించి.. నడుము కింది భాగం మొత్తం సూటిగా ఆకాశం వైపు ఉండేలా ఎత్తి పట్టాలి. దీనివల్ల నడుము, మోకాలి భాగంలోని నొప్పులు తగ్గుతాయి. గాయాలు కాకుండా కాపాడతాయి. 

clamshell

క్లామ్ షెల్ (Clamshell) : క్లామ్ షెల్ వ్యాయామం వల్ల పిరుదుల భాగంలోని కండరాల మీద ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మోకాల్లోని ఎముకలు, కండరాలు అలైన్ మెంట్ పోకుండా ఉంటుంది. తద్వారా మోకాలి నొప్పులు రాకుండా.. వస్తు ఉపశమనంగా ఉంటుంది. 

click me!